స్వార్థంతోనే గీత తప్పుడు ఆరోపణలు | ysrcp paderu mla Eswari takes on MP kottapalli geetha | Sakshi
Sakshi News home page

స్వార్థంతోనే గీత తప్పుడు ఆరోపణలు

Published Wed, Aug 6 2014 10:42 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

స్వార్థంతోనే గీత  తప్పుడు ఆరోపణలు - Sakshi

స్వార్థంతోనే గీత తప్పుడు ఆరోపణలు

 *వైఎస్సార్ సీపీలో మహిళలకు ప్రత్యేక గౌరవం
 *పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పష్టీకరణ

 చింతపల్లి: స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీలో తనకు తగిన ప్రాధాన్యమివ్వడం లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు. ఆమె మంగళవారం చింతపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి గిరిజనులపై ఎంతో ఆప్యాయత చూపిస్తారన్నారు. కొత్తపల్లి గీతకు మొదటి నుంచి పార్టీలో ప్రత్యేక స్థానం కల్పించి ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు.

గెలిపించిన పార్టీపైనే ఆమె తప్పుడు విమర్శలు చేయటం తగదన్నారు. గిరిజన ఎమ్మెల్యేలంతా జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వాన్నే కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీలో ఇమడలేకపోతే పదవులకు రాజీనామా చేసి బయటికి వెళ్లిపోవాలి తప్పా, అసత్య ప్రచారాలు చేస్తే గిరిజనులు క్షమించరని హెచ్చరించారు. పార్టీ విప్‌ను ధిక్కరించినందువల్లే చింతపల్లి ఎంపీపీ సహా ముగ్గురు సభ్యులపై అనర్హత వేటు పడిందన్నారు. ప్రతి ఒక్కరు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పని చేయాలని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement