2,520 కిలోల గంజాయితో వ్యాన్‌ సీజ్‌  | Van siege with 2520 kg of marijuana Paderu | Sakshi
Sakshi News home page

2,520 కిలోల గంజాయితో వ్యాన్‌ సీజ్‌ 

Published Thu, Sep 2 2021 3:49 AM | Last Updated on Thu, Sep 2 2021 3:49 AM

Van siege with 2520 kg of marijuana Paderu - Sakshi

పట్టుబడిన 2,520 కిలోల గంజాయి

పాడేరు: ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పెద్ద మొత్తంలో పోలీసు శాఖ పట్టుకుంది. మంగళవారం సాయంత్రం విశాఖ జిల్లా పాడేరు మండలం చింతలవీధి జంక్షన్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఏపీ30యూ3517 నంబర్‌ గల ఐచర్‌ వ్యాన్‌ తనిఖీ చేయగా ఈ గంజాయి అక్రమ రవాణా వెలుగు చూసిందని ఎస్‌ఐ లక్ష్మణ్‌ బుధవారం తెలిపారు.

వ్యాన్‌ వెనుక భాగంలో తనిఖీ చేస్తున్న సమయంలో వాహనంలో ఉన్న డ్రైవర్, ఇతర సిబ్బంది తప్పించుకుని పరారయ్యారని ఎస్‌ఐ తెలిపారు. ఈ ఐచర్‌ వ్యాన్‌ను సీజ్‌ చేశామని, 2,520 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.75 లక్షలు ఉంటుందన్నారు. పరారైన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement