విశాఖ జిల్లాలో కుటుంబకలహాలతో ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
విశాఖపట్టణం : విశాఖ జిల్లాలో కుటుంబకలహాలతో ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం జిల్లాలోని పాడేరు మండలం ఉప్పెటిపొట్టు గ్రామంలో జరిగింది. వివరాలు..గ్రామానికి చెందిన కిల్లు రంభ(30) గత కొంత కాలంగా కుటుంబ సమస్యలతో భాదపడుతోంది. ఈ క్రమంలోనే శనివారం గ్రామసమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్ట్‌మార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(పాడేరు)