పాడేరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం పిలుపు మేరకు శుక్రవారం ఏజెన్సీ బంద్ నిర్వహిస్తున్నారు.
పాడేరు(విశాఖ): పాడేరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం పిలుపు మేరకు శుక్రవారం ఏజెన్సీ బంద్ నిర్వహిస్తున్నారు. బంద్ నేపథ్యంలో గిరిజన నాయకులు బస్సులను కదలనివ్వకుండా ఎక్కడికక్కడే ఆపేయడంతో ప్రజారవాణా స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మొహరించారు.