విషజ్వరంతో బాధపడుతున్న చిన్నారి సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో మృతిచెందింది.
పాడేరు (విశాఖ) : విషజ్వరంతో బాధపడుతున్న చిన్నారి సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో మృతిచెందింది. ఈ సంఘటన విశాఖ జిల్లా పాడేరు మండలం రాజాపురం గ్రామంలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. రాజాపురం గ్రామానికి చెందిన సునంద(3) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది.
కాగా శనివారం విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో పరిశీలించిన డాక్టర్లు సెర్బియల్ మలేరియాతో పాప బాధపడుతోందని చెప్పారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించి పాప మరణించింది. ముందే తెచ్చి ఉంటే బతికేదని వైద్యులు అనడంతో.. తమ పాప వైద్యం అందకనే మృతి చెందిందని చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.