గిరి బతుకులపై దుర్‘మార్గం’
- 11 మండలాల్లో అభివృద్ధి చెందని రోడ్లు
- 100 గ్రామాల గిరిజనుల అవస్థలు
పాడేరు: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లవుతున్నా మారుమూల గ్రామాల గిరిజనులు రవా ణా సౌకర్యాల్లేక నరకయాతన పడుతున్నారు. ఇప్పటికీ ఏజెన్సీలో రోడ్లు లేని గ్రామాలు కోకొల్లలు. కొయ్యూరు నుంచి అనంతగిరి వ రకు 11 మండలాల్లోని కుగ్రామాల్లో ఇప్పటికీ రోడ్లు అభివృద్ధి చెందలేదు. అనేక పంచాయతీ కేంద్రాలకు పక్కా రోడ్డు సౌకర్యం లేదు.
పాడేరు, పెదబయలు మండలాల పరిధిలోని కించూరు, కుం తుర్ల, కిముడుపల్లి, పెదకోడాపల్లి పంచాయతీల పరిధిలో రోడ్లు అభివృద్ధి చెందలేదు. ఆర్టీసీ బస్సు సౌకర్యానికి కూడా నోచుకోని సు మారు 100 గ్రామాల గిరిజనులు దుర్భర జీవ నం సాగిస్తున్నారు. మండల కేంద్రాలకు చేరుకునేందుకు ప్రయివేటు జీపుల్లో ప్రమాదకర ప్ర యాణం సాగిస్తున్నారు. గమ్యం చేరేవరకు ప్రా ణాలను అరచేతిలో పెట్టుకుంటున్నారు. పది హేను మం దికి మించి చోటు లేని ప్రయివేటు జీపుల్లో 40 నుంచి 50 మంది వరకు ప్రయాణిస్తున్న తీరు వారి రవాణా అవసరాలకు అద్దం పడుతున్నాయి.
పెదకోడాపల్లి-గుత్తులపుట్టు మార్గంలో ఈ భయానక ప్రయాణం నిత్యకృత్యమైంది. అధ్వానపు రోడ్డును అభివృద్ధి చేస్తే బ స్సు సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నా పాలకుల్లో చలనం లేదు. గిరిజనాభ్యున్నతికి రూ.వేల కోట్లు నిధులు మంజూరవుతున్నా గిరిజనులకు కనీస సౌకర్యాలను కల్పించలేక పోతున్నారు.