పాడేరు (విశాఖ): విశాఖ జిల్లా పాడేరులోని శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు ఆదివారం వేకువజామున ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు హాజరు కాగా అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, పాదాలు, ఘటాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఊరి మధ్యలో ఏర్పాటు చేసిన పతకం పట్టు(తాత్కాలిక మందిరం)లో కొలువుదీర్చారు. అలా అమ్మవారిని గ్రామంలోకి ఆహ్వానించడం అనాదిగా వస్తోంది.
పతకం పట్టులో కొలువుదీరిన అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలను తిగిరి మంగళవారం ఆలయానికి చేర్చడంతో ఉత్సవాలు ముగుస్తాయి. మంగళవారం నాటి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, రావెల కిశోర్ బాబుతోపాటు, ఆలయ కమిటీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ స్థానిక ఎమ్మెల్యేలు గిడ్డీశ్వరి, రోజా తదితరులు పాల్గొంటారు. అదే రోజు సుమారు లక్ష మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి మోదకొండమ్మ అమ్మవారి దర్శనం కోసం తరలివస్తారని అంచనా. ఈ మూడు రోజులపాటు పాడేరు గ్రామస్తులు తమ ఇళ్లల్లో అమ్మవారిని అత్యంత భక్తి ప్రపత్తులతో కొలుస్తారు.
వైభవంగా మోదమాంబ ఉత్సవాలు ప్రారంభం
Published Sun, May 10 2015 9:45 AM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM
Advertisement
Advertisement