Published
Sat, Sep 3 2016 11:32 PM
| Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
దాలియా పూల సోయగం
అందాలకు నెలవైన విశాఖ మన్యానికి దాలియా పూలు మరింత ప్రత్యేకత తీసుకువస్తున్నాయి. ఈ ఏడాది వివిధ రంగుల్లో దాలియా పూలు విరగ్గాస్తున్నాయి. గిరిజన రైతులకు వీటి అమ్మకాల ద్వారా మంచి ఆదాయం సమకూరుతోంది. పంచాయతీ కేంద్రమైన కొట్నాపల్లి గ్రామంలో వైలెట్ రంగులోని దాలియా పూలు రోడ్డు వెంబడి వెళ్లే వారిని ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఈ పూలను హుకుంపేట, పాడేరు ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్మకాలు జరుపుతున్నారు. –హుకుంపేట