
కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్
పాడేరు: దర్శకధీరుడు రాజమౌళి సినిమాల షూటింగ్‌లన్నీ గోప్యంగానే జరుగుతాయి. చివరి వరకు సినిమాలో ముఖ్య అంశాలు వెలుగులోకి రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. జూనియర్ ఎనీ్టఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విషయంలోనే ఇదే పంథాను అనుసరించారు. అయితే పాడేరు ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఇప్పుడు బయటకు రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
పాడేరు ప్రాంతంలో రెండు రోజుల నుంచి ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సంబంధించి కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అమ్మవారి పాదాల గుడికి దూరంగా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ ప్రాంతానికి సినీ అభిమానులను, మీడియాను కూడా చిత్రం యూనిట్ రానివ్వడం లేదు. మంగళవారం జూనియర్ ఎన్టీఆర్ అడవిలో జరిగిన షూటింగ్‌లో పాల్గొని,రాత్రికి హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే ఈ జూనియర్ ఎనీ్టఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించిన పలు సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన బయటకు వచ్చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాతో పాటు పలు టీవీ చానళ్లలో హల్‌చల్ చేసింది. బుధవారం జరిగిన షూటింగ్‌లో మాత్రం జూనియర్ ఎనీ్టఆర్ పాల్గొనలేదు. మిగిలిన నటులతో యుద్ధ సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి చిత్రీకరించారు. వీడియో క్లిప్ వైరల్‌పై దర్శకుడు రాజమౌళి గుర్రుగా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్టీఆర్ లుక్‌ను బుధవారం రివీల్ చేసేశారు.
Comments
Please login to add a commentAdd a comment