పంజాబ్: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్లో మంగళవారం ఉదయం లోయలోకి ఓ స్కూల్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందగా, 12 మందికి గాయాలయ్యాయి.
దట్టమైన పొగమంచు కారణంగా స్కూల్ బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లోయలో పడిన బస్సు: ముగ్గురి మృతి
Published Tue, Jan 12 2016 11:50 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM
Advertisement
Advertisement