
ఈ ఫొటోలోని ఇళ్లను చూస్తున్నారుగా. కొండపైన భలే కట్టుకున్నారు కదా. యెమెన్ హధర్మట్ ప్రాంతంలోని డవన్ లోయలో ఉంది ఈ ప్రాంతం. దీనికి సుమారు 500 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఇదో గ్రామం. పేరు హైద్ అల్ జజిల్. వందలాది మంది నివసించేవారు. కానీ 2004 నాటి జనాభా లెక్కల్లో ఇక్కడ 17 మందే ఉన్నారని తేలింది. ఇప్పుడు ఇక్కడ ఒక్కరంటే ఒక్కరే ఉంటున్నారు.
మంచి వేతనాలు వస్తున్న, అన్ని సౌకర్యాలున్న సౌదీ అరేబియాకు అనేక మంది వలస వెళ్లారు. దీంతో వరదలు వచ్చి ఇక్కడి ఇళ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో మరింత శిథిలమయ్యాయి. కొన్నాళ్లుగా కాల్పుల మోతతో దద్దరిల్లిన యెమెన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఫొటోగ్రాఫర్ తారిక్ జైదీ ఇటీవల ఈ ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితులను తన కెమెరాలో బంధించారు.
– సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment