ఆసియాలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే.. అందరూ చెప్పే సమాధానం ముకేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ఈయన నికర విలువ 120.3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. నీతా అంబానీ, అంబానీ వారసులు అందరూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఆసియాలో రెండో అత్యంత సంపన్న కుటుంబం ఏదనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.
ఆసియాలో రెండో అత్యంత సంపన్న కుటుంబం హార్టోనో ఫ్యామిలీ అని తెలుస్తోంది. వీరి నికర విలువ 38.8 బిలియన్ డాలర్లు అని సమాచారం. వీరి కుటుంబ ఆదాయం జార్మ్ గ్రూప్‌తో ప్రారంభమైంది. ప్రస్తుతం వీరు సిగరెట్ పరిశ్రమలోని అగ్రగాములలో ఒకరుగా ఉన్నారు.
హార్టోనో సోదరుల కూడా వ్యాపార రంగంలో గణనీయమైన వృద్ధి సాధించారు. వీరు ఇండోనేషియాలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో పెట్టుబడులు కూడా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. హార్టోనో కుటుంబానికి ఎలక్ట్రానిక్స్, ప్రాపర్టీ, అగ్రిబిజినెస్ వంటి వ్యాపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: అన్నింటా రికార్డులే.. నిర్మలమ్మ ఖాతాలో మరో ఘనత
హార్టోనో ఫ్యామిలీ అధీనంలో జకార్తాలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ పాలిట్రాన్ అండ్ ప్రైమ్ రియల్ ఎస్టేట్ ఉన్నాయి. వీరి కుటుంబ వ్యాపారం ఇండోనేషియాలో ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడింది. దీన్ని బట్టి చూస్తే వీరి సంపద ఎంత ఉంటుందనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment