పారిస్: ఫ్రాన్సుకు చెందిన ప్రముఖ లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్‌వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్(74) అత్యంత సంపన్నుడిగా స్థానం సంపాదించారు. ఎలాన్ మస్క్ స్థానంలో ఆర్నాల్ట్‌ను చేరుస్తూ తాజాగా ఫోర్బ్స్ కంపెనీ రియల్ టైం బిలియనీర్ల జాబితాను ప్రకటించింది. ప్రపంచ కుబేరుడి స్థానంలో ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ శుక్రవారం 204.5 బిలియన్ డాలర్లకు తగ్గిపోగా, బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆస్తుల విలువ ఏకంగా 23.6 బిలియన్ డాలర్లు పెరిగి 207.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఫోర్బ్స్ వివరించింది.
ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ షేర్ల విలువ గురువారం ఒక్కసారిగా 13 శాతం తగ్గడంతో ఆ మేరకు మస్క్ ఆస్తిలో 18 మిలియన్ డాలర్ల మేర కోతపడింది. అదే సమయంలో, ఎల్‌వీఎంహెచ్ షేర్ల విలువ శుక్రవారం 13 శాతం పెరుగుదల నమోదు చేసుకోగా ఆ కంపెనీ మార్కెట్ విలువ 388.8 మిలియన్ డాలర్లకు ఎగబాకిందని ఫోర్బ్స్ తెలిపింది. బెర్నార్డ్‌కు ఎల్‌వీఎంహెచ్‌తోపాటు లూయిస్ విట్టన్, ట్యాగ్ హ్యుయెర్, డామ్ ప్రిగ్నోన్, టిఫ్ఫనీ అండ్ కో వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి. 500 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ఏకైక యూరప్ కంపెనీగా గత ఏడాది ఏప్రిల్‌లో ఎల్‌వీఎంహెచ్ గుర్తింపు పొందింది.
Comments
Please login to add a commentAdd a comment