Where Is India Among The Countries With The Most Billionaires - Sakshi
Sakshi News home page

ధనవంతులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఎక్కడుందంటే?

Published Sun, Apr 9 2023 6:14 PM | Last Updated on Mon, Apr 10 2023 11:40 AM

Where is india among the countries with the most billionaires - Sakshi

ప్రపంచంలోని ధనవంతుల జాబితా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. గడచిన కొన్ని సంవత్సరాలలో ప్రపంచంలో ధనవంతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన నివేదికల ప్రకారం ప్రపంచంలో మొత్తం 2,640 మంది బిలియనీర్లు ఉన్నట్లు తెలిసింది.

ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశమేది, చివరి స్థానంలో ఉన్న దేశమేది, ఇందులో ఇండియా స్థానం ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

ఫోర్బ్స్ వెల్లడించిన నివేదికల ప్రకారం, అత్యధిక బిలినియర్లు ఉన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో మొత్తమ్ 735 మంది బిలినియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో అత్యధిక ధనవంతులున్న దేశం అమెరికా అయినప్పటికీ ప్రపంచ ధనవంతుడు మాత్రం ఫ్రాన్స్‌కు చెందిన వాడు కావడం గమనార్హం.

ప్రపంచ జనాభలో మాత్రమే కాకుండా.. ఎక్కువ మంది బిలినీయర్లు ఉన్న దేశంగా చైనా రెండవ స్థానం ఆక్రమించింది. చైనాలో మొత్తం 495మంది ధనవంతులున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. గతంలో వెల్లడైన జాబితాలో మొత్తం 539 మంది ధనవంతులను, దీన్ని బట్టి చూస్తే ఈ సరి చైనాలో ధనవంతుల సంఖ్య తగ్గింది.

(ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!)

ప్రపంచ జనాభాలో రెండవ స్థానంలో ఉన్న భారత్, ధనవంతుల జాబితాలో మూడవ స్థానంలో ఉంది. మన దేశంలో మొత్తం 169మంది బిలినియర్లు ఉన్నట్లు సమాచారం. భారతేశంలో ఉన్న బిలినియర్ల సంపద సుమారు 675 బిలియన్ డాలర్లు.

ఇక నాలుగు, ఐదు స్థానాల్లో జర్మనీ, రష్యా ఉన్నాయి. ఈ దేశాల్లో ఉన్న బిలినియర్ల సంఖ్య వరుసగా 126, 105 మంది. జర్మనీలోని రిచెస్ట్ పర్సన్‌గా స్క్వార్జ్ గ్రూప్ అధినేత డైటర్ స్క్వార్జ్ నిలిచారు. ఆయన సంపద ప్రస్తుతం 42.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే గత ఏడాది నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాలో దిగ్గజ వ్యాపారులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక చివరి స్థానంలో హంగేరి, స్విజర్లాండ్ వంటి దేశాలు 58వ స్థానంలో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement