రూ. 20 కోట్ల శునకం!!  | costly dog roamed in hyderabad | Sakshi
Sakshi News home page

రూ. 20 కోట్ల శునకం!! 

Published Sun, Dec 17 2023 4:58 AM | Last Updated on Sun, Dec 17 2023 2:59 PM

costly dog roamed in hyderabad - Sakshi

మియాపూర్‌: సినిమాల్లో గెస్ట్‌ అప్పియరెన్స్‌లు.. బడా ఫంక్షన్లలో ప్రదర్శనలు.. ఎక్కడికెళ్లినా విస్తృత మీడియా కవరేజీ.. సెల్ఫీల కోసం ఎగబడే ప్రజలు.. ఇవన్నీ ఏ ప్రముఖుడి లైఫ్‌ స్టైల్‌ను తెలియజేసే వర్ణన అనుకుంటున్నారా? కానే కాదు.. దేశంలోనే అత్యంత ఖరీదైన, భారత్‌లో అరుదుగా పెంచే కకేషియన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన ఓ శునకం అనుభవిస్తున్న విలాస జీవితం తాలూకు ఉదాహరణలు.

దీని ఖరీదు రూ. వేలు, రూ. లక్షలు కూడా కాదు.. అక్షరాలా రూ. 20 కోట్లు!! కాడబామ్‌ హేడర్‌ అనే ఈ శునకం శనివారం హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సందడి చేసింది. దీన్ని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఇండియన్‌ డాగ్‌ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సతీష్‌ ఈ శునకాన్ని రూ. 20 కోట్లుపెట్టి ఈ ఏడాది జనవరిలో నగరానికి చెందిన ఓ డాగ్‌ బ్రీడర్‌ నుంచి కొనుగోలు చేశారు. తాజాగా నగరంలో పెట్‌ షో నిమిత్తం దీన్ని బెంగళూరు నుంచి తీసుకురాగా అది మార్గమధ్యలో కాస్త అలసటకు గురైంది. దీంతో మియా­పూర్‌ మదీనాగూడలోని విశ్వాస్‌ పెట్‌ క్లినిక్‌లో దీనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో తన శునకం పాల్గొని ఇప్పటివరకు 32 పతకాలు సాధించిందని చెప్పారు. 

ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలతోపాటు సినిమాల్లోనూ నటించిందని వివరించారు. దీనితోపాటు రూ. 10 కోట్ల విలువచేసే టిబెటన్‌ మాస్టిఫ్, రూ. 8 కోట్ల విలువచేసే అలాస్కన్‌ మాలమ్యూట్‌ జాతి శునకాలు తన వద్ద ఉన్నాయన్నారు. మూడేళ్ల వయసున్న కాడబామ్‌ హేడర్‌ రోజుకు 3 కేజీల చికెన్‌ను ఆహారంగా తీసుకుంటుందని... ఈ కుక్క కోసం నెలకు రూ. 3 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement