ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు మాత్రం అదుర్స్‌! | Worlds Smallest Smartphone Unihertz Jelly Star | Sakshi
Sakshi News home page

Smallest Smartphone: ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్..  ఫీచర్లు మాత్రం అదుర్స్‌!

Published Sun, Jun 25 2023 8:06 AM | Last Updated on Sun, Jun 25 2023 10:35 AM

Worlds Smallest Smartphone Unihertz Jelly Star - Sakshi

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యూనిహెర్ట్జ్ 3 అంగుళాల డిస్‌ప్లే, పారదర్శక డిజైన్‌తో 'జెల్లీ స్టార్' స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫోన్ ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్‌లో పారదర్శక డిజైన్‌తో నథింగ్ ఫోన్ 1 వంటి ఎల్‌ఈడీ నోటిఫికేషన్ లైట్‌ను ఇచ్చింది కంపెనీ.  ఫోన్‌ లోపల ఉన్న భాగాలు పారదర్శక బ్యాక్‌ ప్యానెల్ నుంచి కనిపిస్తాయి.

ధర, లభ్యత
ఈ బుల్లి స్మార్ట్‌ ఫోన్‌ను 8జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌తో  ఒకే వేరియంట్‌లో కంపెనీ విడుదల చేసింది.  ఇందులో మైక్రో ఎస్‌డీ కార్డ్ కోసం పోర్ట్ కూడా ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను హాంకాంగ్‌లో మాత్రమే విడుదల చేసింది. భారత కరెన్సీ ప్రకారం దీని ధర దాదాపు రూ.17 వేలు. అక్టోబర్ నెల నుంచి ఈ ఫోన్‌ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.

స్పెసిఫికేషన్లు

  • 480 x 854 పిక్సెల్ రిజల్యూషన్‌తో 3 అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లే.
  • MediaTek Helio G-99 ఆక్టాకోర్ ప్రాసెసర్
  • Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌
  • 48 MP రియర్‌ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా
  • 2000mAH బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement