ప్రపంచంలోని చాలా దేశాల్లో రోడ్ల మీద అదే పనిగా హార్న్ కొట్టడం సభ్యత కాదు. ఇతరులను డిస్టర్బ్ చేయడం కింద లెక్క. ఇంకా చెప్పాలంటే సౌండ్ పొల్యూషన్‌గా కూడా పరిగణిస్తారు. కానీ కరీబియన్ కంట్రీస్‌లో మాత్రం కాదు.
అక్కడ కారు, బైక్ హార్న్ కొట్టడమంటే ‘హాయ్.. హలో..’ అంటూ పలకరించడంలాంటిది. ‘థాంక్యూ’కి మారుగా కూడా హార్న్ కొట్టొచ్చు అక్కడ. రోడ్ల మీద స్నేహితులు, బంధువులు ఎవరు కలిసినా.. ఇలా హార్న్ కొట్టి పలకరించుకుంటారట అక్కడ.
స్మార్ట్ టాయ్‌లెట్స్
.. అంటే అంటూ ఐబ్రోస్ ముడేయకండి. ఇవి జపాన్‌లో ఉన్నాయి. ఆ టాయ్‌లెట్స్‌లోకి వెళితే మీ నాడి చూసి మీ ఆరోగ్య రహస్యం చెప్పేస్తాయవి. చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలనూ సూచిస్తాయి. మీరు ఆరోగ్యవంతులని తేలితే.. గ్రీట్ చేసి పంపిస్తాయి.
ఇంతకీ ఇవి ఏ ఆసుపత్రిలోనో.. పాథలాజికల్ ల్యాబ్‌లోనో ఉన్న టాయ్‌లెట్స్ కావు. పబ్లిక్ టాయ్‌లెట్స్. అర్జెంట్ అని పబ్లిక్ టాయ్‌లెట్స్‌లోకి వెళితే.. స్మార్ట్‌గా ఈ హెల్త్‌చెకప్ చేస్తుందట. వాటే టెక్నాలజీ కదా!
చదవండి: ఈ ఇల్లుకు కరెంటు అక్కర్లేదు.. ఎందుకంటే..
Comments
Please login to add a commentAdd a comment