తైపీ : తైవాన్లో సంభవించిన భారీ భూకంపం మృతుల సంఖ్య 55కు చేరుకుంది. ఈ నెల 6న ఈశాన్య తైవాన్ లో భూకంపం రావడంతో వందల మంది గాయాలపాలయ్యారు. కొద్ది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై ప్రాథమికంగా 5.8గా నమోదు అయినప్పటికీ, తర్వాత తీవ్రత 6.7గా నమోదు అయింది. ఇప్పటికీ 80 మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదని అధికారులు వెల్లడించారు. వేయ్ గువాన్ లో ఓ కాంప్లెక్స్ కుప్పకూలి అక్కడ చాలా నష్టం సంభవించింది.
తైవాన్ లో భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం లేదని యూఎస్ జియోలాజికల్ సర్వే గతంలోనే స్పష్టం చేసింది. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగినప్పటికీ వాటి పూర్తి వివరాలు అందుబాటులో లేవని, ఓ అంచనాకు రాలేదని అధికారులు వివరించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రక్షణ బృందాల సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు.
రోజురోజుకు పెరిగిపోతున్న తైపీ మృతుల సంఖ్య
Published Thu, Feb 11 2016 10:48 AM | Last Updated on Fri, Aug 24 2018 7:34 PM
Advertisement