చిలీలో భూకంపం | 6.9 quake, powerful aftershocks strike off Chilean coast | Sakshi
Sakshi News home page

చిలీలో భూకంపం

Published Wed, Nov 11 2015 9:24 AM | Last Updated on Sun, Sep 3 2017 12:22 PM

చిలీలో భూకంపం

చిలీలో భూకంపం

చిలీ: చిలీ తీరంలో బుధవారం భూ ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.9గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నట్లు తెలిపింది. భూకంపం సంభవించినప్పుడు మొట్టమొదటగా తీవ్రత 6.6గా నమోదు అయిందని పేర్కొంది.

అయితే భూకంపం ధాటికి ఎక్కడ ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం కాని సంభవించినట్లు తమకు సమాచారం అందలేదని చెప్పింది. ఇదే ప్రాంతంలో ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో భూకంపం వచ్చి... 15 మంది మరణించారని యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement