ఇండోనేషియాలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. ఆ భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 6.1 నమోదు అయింది. ఇండోనేషియాలోని పశ్చిమ తైమూరు రాజధాని ఢిల్లీ సమీపంలోని బండ సముద్రంలో ఆ భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే భూకంపం వల్ల సునామీ లాంటి విపత్తులు సంభవించే అవకాశం లేదని తెలిపింది.
అయితే ఈ ఏడాది జనవరి నెలలో ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఇదే తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ఘటనలో దాదాపు వంద ఇళ్లు వరకు నష్టం జరిగిందని గుర్తు చేసింది. అలాగే గతేడాది జులైలో సుమిత్రా ద్వీపంలో ఇదే తరహా అదే తీవ్రతతో వచ్చిన భూకంపంలో 35 మందికిపైగా మృత్యువాత పడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.