ఇస్లామాబాద్ : వాయువ్య పాకిస్థాన్లోని పలు జిల్లాల్లో శనివారం స్వల్పంగా భూమి కంపించింది. భూకంప కేంద్రాన్ని ఆఫ్ఘానిస్థాన్ - తజికిస్థాన్ సరిహద్దుల్లో కనుగొన్నట్లు పాకిస్థాన్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కాని సంభవించలేదని తెలిపింది. కాగా ఆప్ఘాన్లోని పశ్చిమ ప్రాంతంలో 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. జనవరి 8వ తేదీన ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించిందని గుర్తు చేసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5 గా నమోదు అయిందని చెప్పింది.