northwest pakistan
-
వాయువ్య పాక్‌లో స్వల్ప భూప్రకంపనలు
ఇస్లామాబాద్ : వాయువ్య పాకిస్థాన్‌లోని పలు జిల్లాల్లో శనివారం స్వల్పంగా భూమి కంపించింది. భూకంప కేంద్రాన్ని ఆఫ్ఘానిస్థాన్ - తజికిస్థాన్ సరిహద్దుల్లో కనుగొన్నట్లు పాకిస్థాన్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కాని సంభవించలేదని తెలిపింది. కాగా ఆప్ఘాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. జనవరి 8వ తేదీన ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించిందని గుర్తు చేసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5 గా నమోదు అయిందని చెప్పింది. -
పాకిస్థాన్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.6గా నమోదు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఉత్తర మరియు వాయువ్య ప్రాంతాలలో మంగళవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.6గా నమోదయింది. ఈ మేరకు పాకిస్థాన్ రేడియో వెల్లడించింది. ఈ రోజు తెల్లవారుజామున ఈ భూకంపం వచ్చిందని పేర్కొంది. అయితే ఎక్కడ ఎటువంటి ఆస్తి... ప్రాణ నష్టం కాని సంభవించలేదని ఉన్నతాధికారులు తెలిపారని పేర్కొంది. పాకిస్థాన్‌లో తరచు భూకంపాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇస్లామాబాద్, రావాల్పిండి, పెషావర్, మల్కండ్, స్వాత్, అబోటాబాద్... తదితర ప్రాంతాల్లో ఈ భూకంపం వచ్చిందని పాక్ రేడియో చెప్పింది. -
పాకిస్థాన్‌ను వణికించిన భూకంపం
పాకిస్థాన్‌లోని వాయవ్య ప్రాంతంలో పెను భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. దీంతో ప్రజలు భయకంపితులయ్యారు. భూకంప కేంద్రం అఫ్ఘానిస్థాన్లోని హిందూకుష్ పర్వతాల్లో ఉంది. ఇది ఖైబర్-ఫక్తుంఖ్వా రాష్ట్ర రాజధాని పెషావర్, చుట్టుపక్కల ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపించింది. అయితే, ప్రభావిత ప్రాంతాల్లో ఎవరూ మృతి చెందినట్లు మాత్రం సమాచారం అందలేదు. 50 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైందని పాకిస్థాన్ వాతావరణ శాఖ తెలిపింది. మన్షేరా, చిత్రాల్, బజౌర్, మింగోరా, మాలాకండ్ జిల్లాల్లో కూడా భూకంప ప్రభావం ఉంది. కాగా, పాక్ నైరుతి దిశలోని బెలూచిస్థాన్ ప్రాంతంలో 5.3 తీవ్రతతో శుక్రవారంనాడే ఓ భూకంపం వచ్చింది. 2005లో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో దాదాపు 74వేల మంది మరణించారు.