ఆగ్నేయ పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాలలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఆ ఘటనలో ఒకరు మరణించగా, 30మంది గాయపడ్డారని యూఎస్ జియోలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ వెల్లడించింది. సింధ్లోని దౌర్ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున 3.50కి భూమీ కంపించిందని... రిక్టార్ స్కేల్పై 4.5గా భూకంప తీవ్రత నమోదైందని తెలిపింది.
మరి కొద్ది సేపటికే మళ్లీ భూమి కంపించిందని రిక్టార్ స్కేల్పై 4.6గా దాని తీవ్రత నమోదైందని వెల్లడించింది. భూకంప తీవ్రతకు కొన్ని జనం ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారని.... కొన్ని ప్రాంతాలలో నివాసాలపై కప్పులు కూలిపోయానని తెలిపింది. భూకంపం నేపథ్యంలో స్థానిక పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అలాగే నేడు జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.