
రష్యాలో భూకంపం
హాంగ్కాంగ్ : తూర్పు రష్యాలో శనివారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదు అయింది. ఈ మేరు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రష్యా యోలిజీవో పట్టణానికి 95 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే ఈ భూకంప ధాటికి ప్రాణ, ఆస్తి నష్టం కానీ జరిగినట్లు సమాచారం అందలేదని పేర్కొంది. సునామీ విపత్తు వచ్చే అవకాశం లేదని ది నేషనల్ అండ్ పసిఫిక్ వార్నింగ్ సెంటర్ స్పష్టం చేసింది.