
టోక్యో నగరంలో భూకంపం
టోక్యో : జపాన్ రాజధాని టోక్యోలో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.4 గా నమోదు అయింది. ఈ భూకంపం దాటికి పలు నివాసాలు, భవనాలు కదిలాయని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపింది. టోక్యో తీరంలో 70 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది.