పాపువా న్యూగినియా లో భారీ భూకంపం
సిడ్నీ: పాపువా న్యూ గినియాలో మంగళవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఉదయం 5.38 నిమిషాల సమయంలో అడ్మిరాల్టీ ఐ ల్యాండ్స్ కేంద్రంగా 6.3 తీవత్రతో భూకంపం వచ్చినట్లు యూఎస్ శాస్త్రజ్ఞులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు ఇంకా తెలియరాలేదు.
భూకంపం కారణంగా ఎలాంటి సునామీ సంభవించే అవకాశం లేదని హవాయిలోని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది. అడ్మిరాల్టీ ఐల్యాండ్స్ లో భూకంపాలు సంభవించడం సర్వసాధారణం. ద్వీపం చుట్టూ వున్న దాదాపు 4,000 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ కారణంగా టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. దాంతో ద్వీపంలో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి.