పోర్ట్ మోరెస్బీ : పపువా న్యూగినియాను భూకంపం కుదిపేసింది. రిక్కర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. బులాలో నగరానికి 33 కిలోమీటర్లు, రాజధాని పోర్ట్ మోరెస్బీకి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. భారీ స్థాయి భూకంపం వచ్చినప్పటికీ పపువా న్యూగినియాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశాలు లేవని ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ మెట్రోలజీ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment