
న్యూ గినియాలో భారీ భూకంపం
న్యూయార్క్: పపువా న్యూ గినియా తీరంలో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.5 గా నమోదైంది. దక్షిణ పసిఫిక్ ద్వీపం న్యూ గినియాలో కొకొపో పట్టణానికి దక్షిణాదిన 139 కిలో మీటర్ల దూరంలో 60 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. భూకంప కేంద్రం నుంచి 300 కిలో మీటర్ల దూరంలో సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సివుంది.