
పాపువా న్యూ గినియాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగి పడిన ఘటనలో దాదాపు 2000 మంది సజీవ సమాధి అయ్యారని ఆ దేశ నేషనల్ డిజాస్టర్ సెంటర్ పేర్కొంది. ఈ మేరకు ఐరాస ఆఫీసుకు పాపువా న్యూ గినియా అధికారులు సమాచారం ఇచ్చారు.
వివరాల ప్రకారం.. పావువా న్యూ గినియాలో కొండ చరియలు విరగిపడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు రెండు వేల మంది సజీవ సమాధి అయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించింది. కొన్ని చోట్ల 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పలుగా పడినట్టు సమాచారం. కాగా, చాలా చోట్ల ఇలా కొండచరియలు విరిగి పడుతుండటంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. పెద్ద సైజులో బండరాళ్లు ఉండటంతో మృతదేశాల వెలికితీత కష్టంగా మారింది.
More than 2,000 people were buried alive in a massive landslide in Papua New Guinea . pic.twitter.com/avgy49mEPg
— Baba Banaras™ (@RealBababanaras) May 27, 2024
ఇక, ఈ ప్రమాద ఘటన కారణంగా 2000 మంది మరణించారని ఆ దేశంలోని నేషనల్ డిజాస్టర్ సెంటర్ నుంచి ఐరాస ఆఫీస్‌కు సమాచారం వెళ్లింది. ఈ మేరకు సోమవారం ఉదయం లేఖను ఆ కార్యాలయానికి పంపింది. తమ దేశానికి తగు సాయం అందించాలని కోరింది. అలాగే, మిత్రదేశాలు అందించే సాయాన్ని డిజాస్టర్ సెంటర్ ద్వారా సమన్వయం చేసుకొంటామని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
Drone video reveals extent of the damage caused by a landslide in Papua New Guinea, which killed more than 670 people according to the UN.
Rescue workers are trying to retrieve bodies from under the mud. pic.twitter.com/SPvUjdeaQF— Al Jazeera English (@AJEnglish) May 26, 2024
అయితే, ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంపై శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మౌంట్ ముంగాల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సందర్భంగా ప్రావిన్స్‌లో భారీ నష్టం వాటిల్లింది. ఆ ప్రాంతంలో ఉన్న నివాసాలు దాదాపు నేలమట్టమయ్యాయి. కొండచరియల కారణంగా ప్రజా రవాణాకు సైతం తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment