![Rain fury claims 30 lives in 4 northern states, 5 missing](/styles/webp/s3/article_images/2024/08/12/rains.jpg.webp?itok=bwuiYvpD)
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు రెండు రోజులుగా వణికిస్తున్నాయి. ఇళ్లు కూలి, కొండచరియలు విరిగిపడి, జలాశయాలు పొంగిపొర్లిన ఘటనల్లో 28 మంది మృతి చెందారు. హరియాణాలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జమ్మూకశీ్మర్ యంత్రాంగం అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. రాజస్తాన్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 16 మంది చనిపోయారు.
రాష్ట్రంలోని కరౌలీ జిల్లాలో రికార్డు స్థాయిలో 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఆదివారం వరదల్లో వాహనం కొట్టుకుపోయిన ఘటనలో ఒకే కుటుంబంలోని 8 మంది చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో జన జీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో నీరు నిల్చి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏడేళ్ల బాలుడు నీట మునిగి చనిపోయాడు. హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలతో కొండచరియలు విరిగిపడి ముగ్గురు బాలికలు మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment