house collapses
-
ఉత్తరాదిన కుండపోత.. 28 మంది మృతి
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు రెండు రోజులుగా వణికిస్తున్నాయి. ఇళ్లు కూలి, కొండచరియలు విరిగిపడి, జలాశయాలు పొంగిపొర్లిన ఘటనల్లో 28 మంది మృతి చెందారు. హరియాణాలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జమ్మూకశీ్మర్ యంత్రాంగం అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. రాజస్తాన్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 16 మంది చనిపోయారు. రాష్ట్రంలోని కరౌలీ జిల్లాలో రికార్డు స్థాయిలో 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పంజాబ్లోని హోషియార్పూర్లో ఆదివారం వరదల్లో వాహనం కొట్టుకుపోయిన ఘటనలో ఒకే కుటుంబంలోని 8 మంది చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో జన జీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో నీరు నిల్చి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏడేళ్ల బాలుడు నీట మునిగి చనిపోయాడు. హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలతో కొండచరియలు విరిగిపడి ముగ్గురు బాలికలు మృత్యువాత పడ్డారు. -
వరద బీభత్సం.. నెమ్మదిగా మింగేసింది
-
ఉత్తర ప్రదేశ్లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్లో వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా ముజఫర్నగర్లోని ఒక భవనం కుప్పకూలింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ దుర్ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. కాగా, ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు.. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే, వీరిని పరీక్షించిన వైద్యులు ప్రమాద స్థలంలోనే ముగ్గురు చనిపోయినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వారిని జుబేదా(35), మీనా(65), అలీశాలుగా గుర్తించారు. అదే విధంగా గాయపడిన మరో నలుగురిని ఇంతియాస్ (45),సైరా(40), నగ్మా(21), పర్వేజ్లుగా గుర్తించించామని తెలిపారు. వీరికి అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్నయూపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని విష్ణు గార్డెన్ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. రెండతస్తుల భవనం పైకప్పు కూలి నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రమాదం నెలకొన్న ఆ ఇంటిని మోటార్ వైండింగ్ ఫ్యాక్టరీగా ఉపయోగిస్తున్నారు. ఈ ప్రమాదంపై అదనపు డిప్యూటీ కమిషనర్ సుభోద్ కుమార్ గోస్వామి మాట్లాడుతూ ‘ఉదయం 10 గంటల సమయంలో భవనం పైకప్పు కూలినట్లు ఫోన్ కాల్ వచ్చింది. ఆ సమయంలో ఆరుగురు ఫ్యాక్టరీలో ఉన్నారు. వారిని పోలీసులు రక్షించి, సమీప ఆస్పత్రికి తరలించాం. అయితే అప్పటికే వారిలో నలుగురు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు’ అని చెప్పారు. -
కుప్పకూలిన ఇళ్లు.. ఆరుగురు మృతి
లక్నో : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇళ్లు కుప్పకూలిన ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ సహరన్పుర్ జిల్లాలోని గంగోకు చెందిన ఓ ఇళ్లు గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శుక్రవారం రాత్రి కుప్పకూలింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు ఇంటి శకలాలు మీద పడి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారమివ్వటంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. శకలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. మృతి చెందిన ఆరుగురిని ఫైజన్(45), అతని భార్య ఇసానా(38) కొడుకు ఫైసల్(13), కూతుళ్లు సహినా(11), రాణి(9), జైనఫ్(2)గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారిలో చిన్న పిల్లలు సైతం ఉండటం పలువురిని కలిచి వేసింది. -
కుప్పకూలిన ఇంటిపైకప్పు :5మంది మృతి
-
సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం
ధర్మవరం (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా ధర్మవరంలోని పీఆర్టీ వీధిలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసమైంది. పండ్ల వ్యాపారం చేసే మల్లేశ్ కుటుంబం మంగళవారం ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం వెళ్లారు. ఆ సమయంలో గ్యాస్ లీకై సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో ఇంట్లోని తలుపులు, కిటికీలు మంటలకు కాలిపోయాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయాయి. దాదాపు రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని కుటుంబ యజమాని మల్లేశ్ చెప్పారు. కాగా ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
భవనం కూలి: 12 మంది మృతి
చందౌలి: ఉత్తరప్రదేశ్లో మొగల్ సరాయి ప్రాంతంలోని దుల్పూర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం శనివారం రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని జిల్లా ఎస్పీ మునిరాజ్ ఆదివారం వెల్లడించారు. వారిలో నలుగురు కార్మికులు కాగా మిగిలిన వారు ఇంటి యజమానితోపాటు అతడి కుటుంబసభ్యులేనని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గాయపడిన వారిద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మృతులు ఒక్కొక్కరికి రూ. 30 వేల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎన్ కే సింగ్ ప్రకటించారు.