
కుప్పకూలిన ఇళ్లు
లక్నో : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇళ్లు కుప్పకూలిన ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ సహరన్‌పుర్ జిల్లాలోని గంగోకు చెందిన ఓ ఇళ్లు గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శుక్రవారం రాత్రి కుప్పకూలింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు ఇంటి శకలాలు మీద పడి అక్కడికక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారమివ్వటంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. శకలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. మృతి చెందిన ఆరుగురిని ఫైజన్(45), అతని భార్య ఇసానా(38) కొడుకు ఫైసల్(13), కూతుళ్లు సహినా(11), రాణి(9), జైనఫ్(2)గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారిలో చిన్న పిల్లలు సైతం ఉండటం పలువురిని కలిచి వేసింది.
Comments
Please login to add a commentAdd a comment