Saharanpur
-
ఉడ్ కార్వింగ్ కళాకారులపై సాక్షి స్పెషల్ రిపోర్ట్
-
యూపీలో అరుదైన దృశ్యాలు కనువిందు
లక్నో: కరోనా వల్ల ప్రకృతి కాస్త ఊపిరి పీల్చుకున్నట్లైంది. రోడ్లపై బండ్లు తిరగక గాలి స్వచ్ఛత మెరుగుపడింది. పరిశ్రమలు తెరవకపోవడంతో దాని వ్యర్థాలు నీళ్లలో కలవక నదులు పరిశుభ్రంగా మారాయి. దీంతో ప్రకృతి అందాలను ప్రజలు ఆస్వాదిస్తున్నారు. తాజాగా ప్రజలకు వీనులవిందు చేసే దృశ్యం ఉత్తర ప్రదేశ్‌లో ఆవిష్కృతమైంది. రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరాఖండ్‌లోని మంచుకొండలు యూపీలోని షహరాన్‌పూర్‌లో దర్శనమిస్తున్నాయి. ఈమేరకు భారత అటవీశాఖ అధికారి రమేశ్ పాండే దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. "అటు లాక్డౌన్, ఇటు అడపాదడపా కురుస్తున్న వర్షాలు గాలి నాణ్యతను గణనీయంగా మెరుగుపర్చాయి. (అరుదైన ‘మంచు చిరుత’ను చూశారా?) అందుకు వసంత్ నగర్లో నివసిస్తున్న ఆదాయపన్ను అధికారి దుశ్యంత్ తన ఇంటి నుంచి తీసిన ఈ ఫొటోలే నిదర్శనం" అని చెప్పుకొచ్చారు. మరో అటవీ అధికారి పర్వీన్ కశ్వన్ సైతం మంచు కొండల ఫొటోలను పంచుకున్నాడు. పలువురు సైతం తమ చుట్టూ కనువిందు చేస్తున్న ప్రకృతి దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. సుమారు 30 ఏళ్ల తర్వాత యూపీలో ఇలా మంచు కొండలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వీటి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇక పంజాబ్‌లోని జలంధర్‌వాసులకు హిమాచల్ ప్రదేశ్‌లోని దౌలాధర్ మంచు కొండలు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. (అంత దగ్గరనుంచి తీస్తే పోతారు) Snow capped peaks of Himalaya are now visible from Saharnpur ! Lockdown and intermittent rains have significantly improved the AQI. These pictures were taken by Dushyant, an Income Tax inspector, from his house at Vasant Vihar colony on Monday evening. #lockdowneffect #nature pic.twitter.com/1vFfJqr05J — Ramesh Pandey IFS (@rameshpandeyifs) April 29, 2020 A view of Saharanpur.. Mother Nature is healing itself. Positive impact of #Lockdown..Pollution free enviroment. (#Saharanpur #Uttarakhand #India #IncredibleIndia ) Link-https://t.co/oaxGGJQp86 pic.twitter.com/CKU5vamfkQ — Dr. Shuchita Vatsal (@SJVatsal) April 29, 2020 When you can see snow peaks from Saharanpur. They say it is rare to see these peaks which are 150-200 km far. I hope now people will appreciate what they were missing earlier. PC Ashutosh Mishra. pic.twitter.com/1jeGlK7LZx — Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 29, 2020 -
మద్యం మాఫియా ఆగడం : జర్నలిస్టు మృతి
లక్నో: యూపీలో లిక్కర్ మాఫియా బరితెగించింది. సహరన్‌పూర్‌లో ఆదివారం ఓ జర్నలిస్ట్, ఆయన సోదరుడిని మద్యం మాఫియా కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. ప్రముఖ హిందీ వార్తాపత్రికలో పనిచేసే జర్నలిస్ట్‌ను గతంలోనూ పలు సందర్భాల్లో మద్యం మాఫియా బెదిరించిందని సమాచారం. దుండగుల కాల్పుల్లో గాయపడిన జర్నలిస్ట్ ఆశిష్ జన్వాని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, ఆయన సోదరుడు ఘటనా స్ధలంలోనే మరణించారు. ఈ ఘటనకు సంబందించి పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్ట్‌ను మద్యం మాఫియా హతమార్చడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. తనకు బెదిరింపులు రావడంపై ఆశిష్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని స్ధానికులు ఆరోపించారు. కాగా మద్యం మాఫియా జర్నలిస్టుపై కాల్పులు జరిగిన సమాచారం అందగానే డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులకు రూ 5 లక్షల చొప్పున యూపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. -
సహారన్పూర్: అందరికీ పరీక్ష
లోక్‌సభ ఎన్నికల ప్రచారం పశ్చిమ యూపీలోని సహారన్పూర్ స్థానం నుంచే ప్రారంభించాలని పాలకపక్షమైన బీజేపీ, బీఎస్పీ, ఎస్పీ, ఆరెల్డీ కూటమి నిర్ణయించడంతో అందరి దృష్టి దీనిపై పడింది. మొదటి దశలో పోలింగ్ జరిగే ఈ సీటును 2014లో బీజేపీ కైవసం చేసుకుంది. మూడోవంతుకు పైగా ముస్లింలు ఉన్న సహారన్పూర్లో కాంగ్రెస్, బీఎస్పీ ముస్లిం అభ్యర్థులను నిలిపాయి. కిందటిసారి జరిగినట్టే బీజేపీ ప్రత్యర్థుల మధ్య మైనారిటీల ఓట్లు చీలితే ప్రస్తుత బీజేపీ ఎంపీ రాఘవ్ లఖన్‌పాల్ మళ్లీ గెలవవచ్చు. యూపీ బీజేపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం సహారన్పూర్ జిల్లాలోని శాకాంబరి ఆలయం నుంచి ప్రారంభించారు. బీఎస్పీ–ఎస్పీ కూటమి కూడా తమ తొలి సంయుక్త ర్యాలీని ఈనెల 7న ఈ జిల్లాలోని దేవబంద్‌లో నిర్వహించబోతోంది. దేవబంద్‌లో అతిపెద్ద ముస్లిం అధ్యయన పీఠం ఉంది. ప్రతిపక్షాలు దేవబంద్‌ను తొలి ర్యాలీకి ఎంపిక చేయడం వాటి ఆలోచనలు, పోకడలకు అద్దం పడుతోందని ఆదిత్యనాథ్ విమర్శించారు. శాకాంబరి గుడికి 40 కిలోమీటర్ల దూరంలో దేవబంద్ ఉంది. 2017లో కూడా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సహారన్పూర్ నుంచే పరివర్తన్ యాత్ర ప్రారంభించారు. ఇమ్రాన్ మసూద్‌కే మళ్లీ కాంగ్రెస్ టికెట్ కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌ను బీజేపీ అభ్యర్థి లఖన్‌పాల్ 65 వేల మెజారిటీతో ఓడించారు. 2014 లోక్‌సభ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోదీపై మసూద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని ముక్కలు ముక్కలుగా కోస్తానని అన్నందుకు మసూద్‌తో కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పించింది. కాని, ఇప్పుడు మసూద్‌నే కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్ణయించారు. బీజేపీపై బీఎస్పీ తరఫున పోటీచేస్తున్న ఫజ్లూర్ రహ్మాన్‌ను బలమైన అభ్యర్థిగా పరిగణిస్తున్నారు. మాంసం వ్యాపారి అయిన రహ్మాన్‌కు ఇక్కడ మంచి పలుకుబడి ఉంది. నియోజకవర్గంలో 42 శాతం ఉన్న ముస్లిం ఓట్లు కాంగ్రెస్, బీఎస్పీ మధ్య చీలిపోతే బీజేపీ గెలిచే అవకాశముంది. బీజేపీ అభ్యర్థిని ఓడించాలనే లక్ష్యంతో మైనారిటీలు వ్యూహాత్మకంగా బలమైన ముస్లిం అభ్యర్థికే ఓటేస్తే ర హ్మాన్‌కు ప్రయోజనకరమౌతుంది. ఇక్కడ బీఎస్పీకే గట్టి పునాది ఉంది. బంధువు వల్లే ఓటమి కిందటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ఓటమికి కారణం ఆయను సమీప బంధువు రషీద్ మసూద్ కొడుకు షాదాన్ మసూద్ సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై పోటీచేసి ఓట్లు చీల్చుకోవడమే. ఇమ్రాన్ 2007 ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2012, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ నెల మొదట్లో భీమ్ ఆర్మీ నేత చంద్రశేఖర్ ఆజాద్‌తో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమావేశమౌతున్నారు. దీని వల్ల ఇమ్రాన్ విజయావకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు. భీమ్ ఆర్మీ సహారన్పూర్ కేంద్రంగానే అవతరించి పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లో దళిత యువకులను ఆకట్టుకుంది. ఈ నెల 11న పోలింగ్ జరిగే ఈ నియోకవర్గంలో బీహత్, సహారన్పూర్, సహారన్పూర్ దేహాత్, రామ్‌పూర్ మణిహరన్, దేవబంద్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. -
సహరాన్పూర్ కిరీటం ఎవరికి?
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2019 సార్వత్రిక ఎన్నికల కోసం ఈసారి కూడా సహరాన్పూర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అక్కడి శాకాంబరి దేవాలయంలో పూజలు చేసి ఆయన తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 2017లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఆయన ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. నాటి ఎన్నికల్లో రాష్ట్రంలోని 403 సీట్లకుగాను బీజేపీ 325 సీట్లకు గెలుచుకుంది. ఇప్పుడు మరో రకంగా కూడా ఈ సహరాన్పూర్ నియోజక వర్గానికి ప్రాధాన్యత చేకూరింది. ఈ నియోజకవర్గంలో 42 శాతం మంది ముస్లింలు ఉన్నారు. ఇక్కడి నుంచి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఇమ్రాన్ మసూద్, నరేంద్ర మోదీని ముక్కలు ముక్కలుగా నరికేస్తానంటూ హెచ్చరించడం నాడు దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఫలితంగా నాటి ఎన్నికల్లో ఇమ్రాన్ మసూద్‌పై బీజేపీ అభ్యర్థి రాఘవ్ లఖన్‌పాల్ 65 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు వారిద్దరు మరోసారి పోటీ పడుతున్నారు. అయితే వారిపై పోటీ చేసేందుకు మూడోవ్యక్తి బరిలోకి దిగారు. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి ఒప్పందంలో భాగంగా ఇక్కడి నుంచి బీఎస్పీ అభ్యర్థి పోటీ చేయాలి. ప్రముఖ ముస్లిం నాయకుడు ఫజ్లూరు రహమాన్‌ను మాయావతి రంగంలోకి దింపారు. ఇద్దరు ముస్లిం నాయకులు తలపడుతున్న కారణంగా ముస్లిం ఓట్లు చీలిపోయి బీజేపీ అభ్యర్థి లఖన్‌పాల్ సులభంగా గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముస్లింలు తెలివిగా ఒక్క బీఎస్పీ అభ్యర్థి రహమాన్‌కే మద్దతిచ్చినట్లయితే ఆయనే ఎక్కువగా గెలిచే అవకాశం ఉందని కూడా వారంటున్నారు. ఇద్దరికి ముస్లింలలో బలం ఉంది. ఏప్రిల్ 11వ తేదీన తొలిదశలోనే ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. -
కుప్పకూలిన ఇళ్లు.. ఆరుగురు మృతి
లక్నో : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇళ్లు కుప్పకూలిన ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సహరన్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ సహరన్‌పుర్ జిల్లాలోని గంగోకు చెందిన ఓ ఇళ్లు గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శుక్రవారం రాత్రి కుప్పకూలింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు ఇంటి శకలాలు మీద పడి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారమివ్వటంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. శకలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. మృతి చెందిన ఆరుగురిని ఫైజన్(45), అతని భార్య ఇసానా(38) కొడుకు ఫైసల్(13), కూతుళ్లు సహినా(11), రాణి(9), జైనఫ్(2)గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారిలో చిన్న పిల్లలు సైతం ఉండటం పలువురిని కలిచి వేసింది. -
పూలన్ దేవీ హంతకుడా, మజాకా ?!
-
పూలన్ దేవీ హంతకుడా, మజాకా ?!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని సహ్రాన్ పూర్లో మే 9వ తేదీన జరిగిన దళితుడైన సచిన్ వాలియా అనుమానాస్పద మృతిపై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుడిగా ‘బందిపోటు రాణి’ పూలన్ దేవీ హంతకుడైన షేర్ సింగ్ రాణా పేరును పేర్కొనడమే అందుకు కారణం. మరోపక్క చనిపోయిన దళితుడు కూడా సామాన్యుడు కాదు. ‘భీమ్ ఆర్మీ’ సహ్రాన్‌పూర్ జిల్లా చీఫ్ కమల్ వాలియా సోదరుడు సచిన్ వాలియా(25). ఇరువర్గాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. రాజ్‌పుత్ అలియస్ ఠాకూర్లు హీరోగా భావించే షేర్ సింగ్ రాణాను అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు యూపీ పోలీసులు సాహసించడం లేదు. 2001లో ఢిల్లీలో జరిగిన ఫూలన్‌దేవి హత్య కేసులో జైలుకెళ్లిన షేర్ సింగ్ రాణా 2004లో జైలు నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు అరెస్ట్ అయ్యారు. ఆ కేసులో యావజ్జీవ జైలు శిక్ష పడిన ఆయన ప్రస్తుతం బెయిలపై ఉన్నారు. 16వ శతాబ్దానికి చెందిన మహారాణా ప్రతాప్ వార్షికోత్సవం సందర్భంగా మే 9వ తేదీన ఠాకూర్లు జరిపిన కాల్పుల్లో సచిన్ వాలియా మరణించారన్నది స్థానిక దళితుల వాదన. షేర్ సింగ్ రాణా ఉద్దేశపూర్వకంగా జరిపిన కాల్పుల్లోనే సచిన్ వాలియా మరణించాడన్నది ఆయన తల్లి వాదన. సచిన్ వాలియా మిత్రులు పొరపాటున జరిపిన కాల్పుల్లో మరణించాడన్నది ఠాకూర్ల వాదన. షేర్ సింగ్ రాణా స్థానికంగా ప్రముఖుడు. ఆయన పేరు, ముఖచిత్రంతో ఉన్న టీషర్టులు ఇంటర్నెట్లో తెగ అమ్ముడుపోతున్నాయి. ఆయన్ని హీరోగా కీర్తిస్తున్న అనేక పాటలు ‘యూట్యూబ్’లో అందుబాటులో ఉన్నాయి. ‘షేర్ సింగ్ రాణా క్షత్రియ యువకులకు నిజమైన హీరో’ అని ఉత్తరప్రదేశ్ క్షత్రియ మహాసభ అధ్యక్షుడు ఖాన్ సింగ్ రాణా వ్యాఖ్యానించారు. పూలన్ దేవీ హత్యతో... పూలన్ దేవీ హత్య వరకు సేర్ సింగ్ రాణా గురించి పెద్దగా ఎవరికి తెలియదు. 2001, జూలై నెలలో పార్లమెంట్ నుంచి అధికార నివాసానికి బయల్దేరిన పూలన్ దేవీని నివాసం వద్ద ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేశారు. వారిలో ఒక వ్యక్తే షేర్ సంగ్ రాణాగా, ఆయనే హత్యకు ప్రధాన కుట్రదారుగా పోలీసులు గుర్తించారు. పూలన్ దేవీ బందిపోటు రాణిగా 21 మంది ఠాకూర్లను హత్య చేసినందుకు ప్రతీకారంగానే తానీ హత్య చేశానని రాణా నేరం అంగీకరించారు. 2004లో జైలు నుంచి తప్పించుకున్న రాణాను ఢిల్లీ ప్రత్యేక విభాగానికి చెందిన పోలీసులు 2006లో కోల్‌కతాలో అరెస్ట్ చేశారు. 2014లో రాణాకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 2016లో ఆయనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయనకు బెయిల్ రావడంలో కూడా రాజకీయ జోక్యం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. తీహార్ జైల్లో ఉన్న రాణాకు 2004కు ముందు జైల్లో కొంతమంది టెర్రరిస్టులు తారసపడ్డారట. 1192లో మొహమ్మద్ ఘోరీ చేతుల్లో ఓడి పోయిన 12వ శతాబ్దానికి చెందిన హిందూ మహారాజు పృధ్వీరాజ్ చౌహాన్ సమాధిలోని అవశేషాలను తీసుకొస్తానని వారితో రాణా సవాల్ చేశాడట. ఆ మేరకు 2004లో ఓ పోలీసు అధికారి (నకిలీ) వెంట కోర్టుకు వెళుతున్నట్లుగా నటించి తీహార్ జైలు నుంచి తప్పించుకున్నారు. మొరదాబాద్, రాంచీ మీదుగా కోల్‌కతా చేరుకున్నారు. అక్కడ సంజయ్ గుప్తా పేరిట నకిలీ పాస్‌పోర్టు సంపాదించారు. బంగ్లాదేశ్‌కు మూడు నెలల వీసా సంపాదించి ఆ దేశానికి వెళ్లారు. అక్కడి నుంచి దుబాయ్‌కి వెళ్లి, అక్కడి నుంచి అఫ్ఘానిస్థాన్ వెళ్లారు. మొహమ్మద్ ఘోరీ తన చేతుల్లో ఓడిపోయిన పృధ్వీరాజ్ చౌహాన్‌ను భారత్‌లో చంపేయకుండా అఫ్ఘానిస్థాన్ తీసుకెళ్లి అక్కడ చంపేశారన్నది రాణా నమ్మకం. అందుకనే ఆయన అక్కడికి వెళ్లారు. అఫ్ఘానిస్థాన్లోని దెహ్యాక్ వెళ్లి అక్కడ పృధ్వీరాజ్ చౌహాన్దిగా భావిస్తున్న ఓ మట్టి సమాధిని తవ్వి కొన్ని అవశేషాలను రాణా భారత్‌కు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని రాణా పలు సందర్భాల్లో భారతీయ మీడియాకు స్వయంగా తెలిపారు. ఆ అవశేషాలను వివిధ క్షత్రియ సంస్థలకు ఇచ్చారు. అందులో కొన్ని అవశేషాలను యూపీలోని మెయిన్‌పురిలోని స్మారక భవనంలో భద్రపర్చారు. అజయ్ దేవగన్‌తో సినిమా! తీహార్ జైలు నుంచి అఫ్ఘానిస్థాన్ వరకు తాను సాగించిన సాహస యాత్ర గురించి రాణా ‘జైల్ డైరీ: తీహార్ సే కాబూల్–కాందహార్’ అనే పుస్తకం రాశారు. ఇది 2012లో విడుదలయింది. ఈ పుస్తకం ఆధారంగా బాలీవుడ్లో సినిమా తీస్తున్నారని, రాణా పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖీ లేదా అజయ్ దేవగన్ నటించనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ విషయమై అజయ్ దేవగన్ తనతో మాట్లాడినట్లు రాణా పలుసార్లు స్వయంగా చెప్పుకున్నారు. (ఠాకూర్ల చేతుల్లో అంతులేని అత్యాచారాలకు గురైన పూలన్‌దేవీ బందిపోటు రాణిగా మారడాన్ని ఇతివృత్తంగా తీసుకొని బాలివుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ ‘బండిట్ క్వీన్’ పేరిట సినిమా తీయడం, 1994లో విడుదలైన ఆ సినిమాకు జాతీయ ఉత్తమ నటి అవార్డు రావడం తెల్సిందే) -
బలవంతంగా మూత్రం తాగించారు.. ఆ అవమానంతో...
లక్నో : ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఆరోపణలతో ఓ యువకుడిపై దాష్టీకానికి పాల్పడ్డారు. పంచాయితీ పెద్దల తీర్పుతో బలవంతంగా అతనితో మూత్రం తాగించగా.. ఆ అవమాన భారంతో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... సహారాన్పూర్లోని ఇందిరా కాలనీకి చెందిన యువకుడికి ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ స్థానికులు దాడి చేశారు. ఈ క్రమంలో పంచాయితీ పెట్టగా.. పెద్దలు దారుణమైన తీర్పు ఇచ్చారు. మహిళలు అతనితో బలవంతంగా మూత్రాన్ని తాగించారు. ఘటన తర్వాత ఇంటికెళ్లిన ఆ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి కాపాడారు. అసలు ఆ యువతి ఎవరో తనకు తెలీదని.. ఎంత చెబుతున్నా వినకుండా గ్రామస్థులు తనపై దాడి చేశారని అతను చెబుతున్నాడు. తనకు ప్రాణహాని ఉందని చెప్పిన అతను పోలీస్ రక్షణ కోరుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు -
ఉగ్రవాదులున్నారు.. అందుకే..!
ముజఫర్‌నగర్ : బంగ్లాదేశ్, పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకాలాపాలు నిర్వహించే వారికి భారత పాస్‌పోర్టులు ఉన్నట్లు అనుమానాలు రావడంతో.. పాస్‌పోర్టులు పరిశీలనకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా దియోబంద్, ముజఫర్‌నగర్, సహరన్పూర్ జిల్లాల్లోని వేల పాస్‌పోర్టులను ధృవీకరణ చేయాల్సిందిగా ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. బంగ్లాదేశ్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరివద్ద భారత పాస్‌పోర్టులు.. దియోబంద్ అడ్రస్‌తో లభించడంతో.. ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు కేంద్రంగా పనిచేసే ఉగ్రవాదులు.. పదుల సంఖ్యలో దియోబంద్‌లో దాక్కున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దియోబంద్లోనే.. ప్రముఖ ముస్లిం మత సంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్ ఉండడం గమనార్హం. బంగ్లాదేశీ అనుమానాస్పద ఉగ్రవాదులు అరెస్టయిన నేపథ్యంలో.. అక్రమంగా దియోబంద్‌లో నివసిస్తున్న బంగ్లా జాతీయులపై తక్షణం చర్యలు తీసుకోవాలని యూపీ సర్కార్ జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక బంగ్లాజాతీయులకు తప్పుడు ధృవీకరణ పత్రాలు జారీ చేసిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ అనేది.. దియోబంద్ లేదా మరో వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న అంశం కాదని షమారాన్పూర్ డీఐజీ ఎమ్మాన్యువల్ తెలిపారు. పాస్‌పోర్టులు ఉన్నవారంతా.. దియోబంద్, ముజఫర్‌నగర్, సహారాన్పూర్లలో తప్పకుండా వెరిఫికేషన్ చేయించుకోవాలని స్పష్టం చేశారు. ముజఫర్‌నగర్, సహారాన్పూర్, దియోబంద్ జిల్లాల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు స్పష్టమైన సమాచారం ఉండడంతోనే విచారణ చేస్తున్నామని ఆయన చెప్పారు. గతంలోనూ సహారాన్పూర్ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలతో ఉన్నవ్యక్తులను గుర్తించినట్లు ఆయన చెప్పారు. అరెస్టయిన బంగ్లాదేశీ ఉగ్రవాదుల వద్దనున్న భారతీయ పాస్‌పోర్టులను చూపించారు. ఇదిలా ఉండగా 20 మంది బంగ్లాదేశ్ జాతీయులు పశ్చిమ యూపీలో అదృశ్యమైన విషయంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. -
కొట్టి తలాక్ అని ముఖంపై విసిరేశాడు
సహరాన్పూర్: ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ఆ తరహా ఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఓ వ్యక్తి తన భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేయడమే కాకుండా అనంతరం ఓ చిన్న కాగితపు ముక్కపై తలాక్ అంటూ మూడుసార్లు రాసి ఆమె ముఖాన విసిరి కొట్టి వెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. సయీద్ అనే వ్యక్తి ఓ ముస్లిం మహిళను నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వారు కట్నంగా ఇస్తానని చెప్పిన రూ.1లక్షను, బైక్‌ను ఇవ్వలేదని గత ఏడాది ఆమెను సయీద్ పుట్టింటికి పంపించాడు. ఈ క్రమంలో మొన్న బుధవారం భార్య దగ్గరకు వచ్చిన సయీద్ వారితో గొడవకు దిగడమే కాకుండా ఓ ఆయుదంతో దాడికి పాల్పడ్డాడు. అనంతరం తలాక్ అంటూ మూడుసార్లు ఓ కాగితంపై రాసి ఆమె ముఖాన విసిరికొట్టి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
యోగి సర్కారుతో రాహుల్ ఢీ!
అనుమతి ఇవ్వకున్నా షహరాన్‌పూర్‌లో పర్యటన న్యూఢిల్లీ: షహరాన్‌పూర్ అల్లర్ల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారుతో నేరుగా తలపడేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సై అంటున్నారు. ఉత్తరప్రదేశ్ అధికారులు అనుమతి నిరాకరించినా.. రాహుల్‌గాంధీ శనివారం షహరాన్‌పూర్‌లో పర్యటించేందుకు బయలుదేరారు. దళితులు, రాజ్‌పుత్ ఠాకూర్ల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణలతో షహరాన్‌పూర్ అట్టుడికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ఎవరూ ఈ ప్రాంతాన్ని సందర్శించవద్దని, వారి పర్యటనలకు అనుమతి లేదని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీ (శాంతిభద్రతలు) ఆదిత్య మిశ్రా శుక్రవారం స్పష్టం చేశారు. అనుమతి లేకపోయినప్పటికీ శనివారం నాడు షహరాన్‌పూర్‌ను సందర్శించాల్సిందేనని రాహుల్ నిర్ణయించారు. ఆయన షహరాన్‌పూర్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించి.. స్థానికంగా పరిస్థితిని సమీక్షించాలని, బాధితులతో మాట్లాడాలని భావిస్తున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి సభ ముగిసిన తెల్లారే షహరాన్‌పూర్‌లో అల్లర్లు తీవ్రమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి పర్యటనకు సిద్ధమైన రాహుల్‌పై యోగి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. -
రాహుల్ పర్యటనకు.. అనుమతి నో
ఇటీవల ఠాకూర్లు.. దళితుల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగి, ఉద్రిక్తతలు చెలరేగిన ఉత్తరప్రదేశ్ లోని సహారన్పూర్ ప్రాంతంలో పర్యటించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నాలకు గండిపడింది. అక్కడ ఆయన పర్యటించేందుకు అనుమతి ఇవ్వలేమని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ ఆదిత్య మిశ్రా తెలిపారు. మొత్తం రాజకీయ నాయకులందరి పర్యటనలను జిల్లా యంత్రాంగం నిషేధించినందున రాహుల్ సహా ఎవ్వరికీ అనుమతి ఇవ్వట్లేదని ఆయన స్పష్టం చేశారు. తొలుత ఈ ప్రాంతాల్లో పర్యటించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పీఎల్ పునియా భావించారు. తనకు అనుమతి రాకపోవడంతో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేశారు. ఇళ్లు కాలిపోయిన దళిత కుటుంబాలను కలిసి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించాలని రాహుల్ భావించారు. మే 5వ తేదీన మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా షబ్బీర్‌పూర్ గ్రామంలో ఠాకూర్లు ఊరేగింపు జరపగా దానికి దళితులు అడ్డు చెప్పడం, ఆ సందర్భంగా ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలలో ఒక ఠాకూర్ యువకుడు మరణించడంతో రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు చెలరేగాయి. దళితులకు చెందిన 50 గుడిసెలు తగలబడ్డాయి. వారిలో కొందరు ఆస్పత్రుల పాలయ్యారు. ఈ వారం ప్రారంభంలో ఆ గ్రామాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి సందర్శించిన తర్వాత మళ్లీ గొడవలు చెలరేగి మరో వ్యక్తి మరణించాడు. దాంతో ఇక ఇక్కడకు రాజకీయ నాయకులు ఎవ్వరినీ అనుమతించకూడదని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. పరిస్థితి మొత్తం సాధారణ స్థితికి చేరుకునేవరకు ఎవరికీ అనుమతి ఇవ్వబోమని అదనపు డీజీ ఆదిత్య మిశ్రా చెప్పారు. -
అధికారులపై సీఎం యోగి కొరడా..!
షహరాన్‌పూర్‌లో సడలని ఉద్రిక్తత.. మొబైల్ ఇంటర్నెట్ బంద్! షహరాన్‌పూర్: దళితులు, రాజ్‌పుత్ వర్గాల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణలను అదుపు చేయడంలో విఫలమైన అధికారులపై ఉత్తరప్రదేశ్ సర్కారు కొరడా ఝళిపించింది. పశ్చిమ యూపీలోని షహరాన్పూర్కు చెందిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులను, ఓ ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసింది. షహరాన్‌పూర్‌లో దళితులు, రాజ్‌పుత్ ఠాకూర్ల మధ్య కులవైరం తలెత్తి గత నెల రోజులుగా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. జిల్లాలోని షబ్బీర్‌పూర్ గ్రామంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి సభ నిర్వహించగా.. ఆ సభలో పాల్గొన్న దళితుడు ఒకరు బుధవారం హత్యకు గురయ్యాడు. మరో 20 మంది గాయపడ్డారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత మరింత తీవ్రస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన సీనియర్ ఎస్పీ ఎస్సీ దుబేను, జిల్లా కలెక్టర్ ఎన్పీ సింగ్‌ను యోగి సర్కారు సస్పెండ్ చేసింది. అంతేకాకుండా జిల్లా డీఐజీ జేకే సాహిపై కూడా వేటు వేసింది. షహరాన్‌పూర్‌లో హింసకు కారణమైన ప్రతి ఒక్కరిపైనా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని యోగి సర్కారు హెచ్చరించింది. సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో ప్రచారమవుతున్న వదంతులు, విద్వేష ప్రసంగాలను ప్రజలు నమ్మవద్దని, సంయమనంతో వ్యవహరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సీఎం యోగి కోరారు. అంతేకాకుండా షహరాన్‌పూర్‌లో విద్వేష వదంతులను అడ్డుకునేందుకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా రద్దుచేశారు. రాజ్‌పుత్ వంశస్తుడైన మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఈ నెల 5న ఠాకూర్లు షబ్బీర్‌పూర్‌లో నిర్వహించిన ఊరేగింపు పట్ల దళితులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఘర్షణ మొదలైంది. ఇక్కడ ఇరు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో ఓ వ్యక్తి మరణించగా, 15 మంది గాయపడ్డారు. అప్పటినుంచి జిల్లాలో ఇరువర్గాల మధ్య దాడులు, ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
యూపీలో కుల సంఘర్షణ!
షహరాన్‌పూర్: ఠాకూర్, దళిత కులాల మధ్య ఘర్షణలతో ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్ జిల్లా అట్టుడుకుతోంది. మతపరంగా సున్నితమైన ఈ జిల్లాలోని పలుచోట్ల మంగళవారం మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఒకరు మరణించగా, కనీసం 20 మంది గాయపడ్డారు. జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షించి.. శాంతిభద్రతలను కాపాడాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. పోలీసులకు తోడుగా సీనియర్ అధికారులను కూడా నియమించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి పర్యటన సందర్భంగా జిల్లాలోని షబ్బీర్‌పూర్‌లో దాదాపు 12 ఠాకూర్ ఇళ్లకు కొందరు దుండగులు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ వర్గం వారిని శాంతింపజేశారు. ఆ గ్రామంలో మాయావతి పర్యటన ముగియగానే, కత్తులు,తుపాకులతో ఓ గుర్తుతెలియని మూక.. మాయావతి సభకు వచ్చిన బీఎస్పీ మద్దతుదారులపై దాడులకు తెగబడింది. బీఎస్పీ శ్రేణులు వెళుతున్న బోలేరో వాహనంపై మూక దాడి చేసి.. తుపాకులతో కాల్పులు కూడా జరపడంతో 24 ఏళ్ల ఆశిష్ ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. గత ఏప్రిల్ నెల నుంచి షహరాన్‌పూర్ జిల్లాలో కులపోరుతో హింస చోటుచేసుకుంటున్నది. రాజ్‌పుత్ వంశస్తుడైన మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఈ నెల 5న ఠాకూర్లు షబ్బీర్‌పూర్‌లో నిర్వహించిన ఊరేగింపు పట్ల ఓ దళితుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకొని.. ఓ వ్యక్తి మరణించగా, 15 మంది గాయపడ్డారు. అప్పటినుంచి జిల్లాలో ఇరువర్గాల మధ్య దాడులు, ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
రూ.10 నోట్లతో కారు కొన్నారు
మీరట్: అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం నోట్లు అందుబాటులో లేక ఇబ్బందిపడుతున్న ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ సహరాన్ పూర్ జిల్లాలోని బెహత్ మండలం కూడా ఒకటి. ఇదే సమయంలో బెహత్ మండలంలోని హుస్సేన్ గ్రామంలో వ్యసనాలకు అలవాటు పడిన ఓ యువకుల బృందం మాత్రం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ అనుమానాస్పదంగా తిరగసాగింది. రాత్రి వేళల్లో బయటకు వెళ్తూ వస్తున్న వీరు సొంతగా ఓ కారు కొన్నారు. అది మొత్తం రూ.10నోట్లతో చెల్లింపులు జరిపారు. దీంతో పోలీసులు నసీర్, రాకేష్, అఫ్జల్, టిటూలపై నిఘా పెట్టారు. గత నెల 19వ తేదీన స్ధానిక భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్ బీఐ)ను ఈ యువకుల బృందం దోచుకున్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేశారు. విచారణలో బ్యాంకు నుంచి రూ.10 లక్షల విలువజేసే రూ.10, రూ.20నోట్లు దొంగిలించినట్లు యువకుల బృందం ఒప్పుకుంది. కాగా, దోచుకున్న డబ్బు నుంచి రూ.50వేలు, కారును స్వాధీనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుల బృందం కొనుగోలు చేసిన కారు.. సెకండ్ హ్యాండ్ అని గ్రామస్ధులు చెప్పినట్లు తెలిపారు. -
ప్రతిఘటించినందుకు బాలికకు నిప్పు
మరో ఘటనలో తల్లి, కుమార్తెపై దాడి సహరాన్పూర్: ఈవ్ టీజింగ్‌ను ప్రతిఘటించినందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక బాలికకు నిప్పంటించగా.. బెంగాల్లో అదే కారణంతో మరొక బాలికను, ఆమె తల్లిని తీవ్రంగా కొట్టి గాయపర్చారు. యూపీలోని సహరాన్‌పూర్‌లో ఇద్దరు అన్నదమ్ములు తనను వేధిస్తున్నారంటూ 16 ఏళ్ల బాలిక వారిని నిలదీసింది. దీంతో వారిద్దరూ తల్లితో కలిసి ఆ బాలికకు నిప్పటించారు. బాలిక శరీరం 95 శాతం కాలిపోయి మృత్యువుతో పోరాడుతోంది. మాల్దా జిల్లా మానికచక్ గ్రామంలో తల్లీకూతుళ్లు నూర్ అలీ అనే యువకుడి ఇంటికి వెళ్లి వేధింపులపై ప్రశ్నించారు. అలీ కుటుంబసభ్యులు బాలికను, ఆమె తల్లిని రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టి గాయపరిచారు. -
సహారన్‌పుర్ అల్లర్ల ప్రధాన నిందితుడి అరెస్ట్
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌లో అల్లర్ల ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొహ్రం అలీ అలియాస్ పప్పుతో పాటు మరో అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందగా ఐదుగురు పోలీసులు సహా 18 మంది గాయపడ్డారు. ఒక వివాదాస్పద భూమి విషయంలో శనివారం చెలరేగిన గొడవ ఇరు వర్గాల మధ్య హింసకు దారితీసింది. ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. ఇళ్లకు, షాపులకు నిప్పుపెట్టారు. అంతేగాక కాల్పులకు కూడా తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి దనీష్, మహ్మద్ ఇర్షాద్, అబీద్, షహీద్, హజీ మహ్మద్ ఇర్ఫాన్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొహ్రం అలీ అరెస్ట్‌ను జిల్లా పోలీస్ అధికారి రాజేష్ పాండే ధ్రువీకరించారు. -
రెండు విడతలుగా కర్ఫ్యూ సడలింపు
సహారన్‌పుర్: ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌లో కర్ఫ్యూ సడలించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు విడతలుగా కర్ఫ్యూ సడలించాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 7 నుంచి 11 గంటలకు వరకు మొదట సడలింపుయిచ్చారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటలకు మరోసారి కర్ఫ్యూ సడలించనున్నామని సహారన్‌పుర్ జిల్లా మేజిస్ట్రేట్ సంధ్య తివారి తెలిపారు. ఈద్గా ప్రాంతంలో ఇతర ప్రాంతాల్లోని మసీదుల్లో ముస్లిం ప్రార్థనల్లో పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా కర్ఫ్య్యూ అమల్లో ఉండడంతో చాలా మంది పండుగను జరుపుకోవడానికి సన్నద్దం కాలేకపోయారు. శనివారం సహారన్‌పుర్‌లో ఒక వివాదాస్పద భూమి విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన హింసలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటివరకు 68 మందిని అరెస్ట్ చేశారు. -
సహారన్‌పుర్‌లో శాంతి.. రాంపూర్‌లో హింస!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌లో కొంతమేరకు శాంతి నెలకొనగా.. మరో పట్టణం రాంపూర్ రాజుకుంది. యూపీ మంత్రి ఆజంఖాన్ సొంత పట్టణం, రాంపూర్ దగ్గరలోని మెహందీపూర్ గ్రామంలో సోమవారం అకస్మాత్తుగా హింస చెలరేగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒక బైక్ ఒక వ్యక్తిని ఢీకొనడంతో చిన్నగా ప్రారంభమైన వివాదం హింసాత్మకమై పరస్పర కాల్పులకు దారితీయడంతో ముగ్గురు చనిపోయారు. సమాచారం తెలియగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, శనివారం హింస ప్రజ్వరిల్లిన సహారన్‌పుర్ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అయినా, అక్కడి పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సోమవారం అధికారులు 4 గంటల పాటు కర్ఫ్యూని సడలించారు. మరోవైపు, సహారన్‌పుర్ ఘటనపై బురద జల్లుకునే కార్యక్రమాన్ని రాజకీయ పార్టీలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు యూపీలో ‘గుజరాత్ మోడల్’ను అనుసరించాలంటూ వివాదాస్పద ట్వీట్ చేసిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రవి వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. గుజరాత్ మోడల్ అంటే తన ఉద్దేశం మతోద్రేకాలు రెచ్చగొట్టడం కాదన్నారు. -
సహారన్‌పుర్ లో 20 మంది అరెస్ట్
సహారన్‌పుర్ (యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్ జిల్లాలో హింసాత్మక ఘటనకు బాధ్యలుగా భావిస్తున్న 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లను అదుపులోకి తీసుకురావడానికి ఆ ప్రాంతంలో విధించిన కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు నేడు కూడా కొనసాగిస్తున్నారు. నిన్నటికంటే పరిస్థితి కొద్దిగా మెరుగైందని జిల్లా మేజిస్ట్రేట్ సంధ్య తివారి తెలిపారు. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. ఒక వివాదాస్పద భూమి విషయంలో శనివారం చెలరేగిన గొడవ ఇరు వర్గాల మధ్య హింసకు దారితీసింది. ఈ హింసలో వ్యాపారస్తుల నేత హరీశ్ కొచార్తోపాటు మరో ఇద్దరు మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. -
సహారన్పూర్లో ఘర్షణలు.. కర్ఫ్యూ విధింపు
ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్ జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. దాంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కర్ఫ్యూ విధించారు. మూడు పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించినా కూడా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఐదుగురు పోలీసులు సహా 18 మంది గాయపడ్డారు. ఓ పోలీసుకు బుల్లెట్ గాయాలు అయ్యాయని, అతడి పరిస్థితి విషమంగా ఉందని సహారన్పూర్ కమిషనర్ తన్వీర్ జాఫర్ అలీ తెలిపారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణల కారణంగా పలు దుకాణాలు, వాహనాలు తగలబడిపోయాయి. రెండు వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాలపై న్యాయవివాదం ఉండటం, దానిపై వివాదాలు చెలరేగడమే ఈ ఘర్షణలకు కారణమని సహారన్పూర్ డీఐజీ రవీంద్ర తెలిపారు. భూమి చుట్టూ ఓ వర్గానికి చెందినవారు శనివారం నాడు ప్రహరీ నిర్మిస్తుండగా రెండోవర్గం వారు అడ్డుకున్నారు. దీంతో వివాదం చెలరేగి ఇరువర్గాల వారు రాళ్లు విసురకున్నారు. పోలీసులు తొలుత రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. తర్వాత 144 సెక్షన్ విధించారు. చివరకు కర్ఫ్యూ విధించి పీఏసీ, ఆర్ఏఎఫ్ దళాలను మోహరించారు. -
ఇమ్రాన్ మసూద్ అరెస్ట్
సహరాన్పూర్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ముక్కలుగా నరుకుతానంటూ విద్వేషపూరిత ప్రసంగం చేసిన కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇమ్రాన్ మసూద్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా న్యాయమూర్తి దానిని తిరస్కరించారు. మసూద్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ.. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మోడీని ముక్కలుగా నరికేస్తానంటూ ఉత్తరప్రదేశ్‌లోని సహరన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ చేసిన ప్రసంగం శుక్రవారం బయటపడిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన దియోబంద్ పోలీసులు శనివారం తెల్లవారుజామున ఇమ్రాన్ మసూద్‌ను అరెస్టు చేశారు. ఆయనను దియోబంద్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అర్చనా రాణి ఎదుట హాజరుపర్చగా... 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కూడా తిరస్కరించారు. మసూద్‌ను వెనకేసుకొచ్చిన కాంగ్రెస్.. విద్వేష ప్రసంగం చేసిన ఇమ్రాన్ మసూద్‌ను కాంగ్రెస్ వెనకేసుకొచ్చింది. ‘‘ఆ ప్రసంగాన్ని 2013 సెప్టెంబర్ 18న సెల్‌ఫోన్‌తో రికార్డు చేశారు. అప్పుడు ఇమ్రాన్ మసూద్ సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 8న మసూద్ కాంగ్రెస్‌లో చేరారు. యూపీలో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలవి. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం పార్టీ నిబంధనలకు లోబడి ఉన్నారు. ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. పార్టీలో చేరకముందు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడెలా చర్య తీసుకోగలం’’ అని యూపీ పీసీసీ సమాచార విభాగం చైర్మన్ సత్యదేవ్ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో శుక్రవారం క్షమాపణ చెప్పిన ఇమ్రాన్ మసూద్.. శనివారం అరెస్టు అనంతరం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘‘నేనేం తప్పు చేయలేదు. బీజేపీకిగానీ, మోడీకిగాని క్షమాపణ చెప్పను. వందసార్లు జైలుకు వెళ్లడానికి సిద్ధం’ అని వ్యాఖ్యానించారు. -
24 గంటల్లో హీరో నుంచి జీరోకి
ఉత్తరప్రదేశ్ లోని సహారన్ పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోకసభ ఎన్నికల బరిలో దిగిన ఇమ్రాన్ మసూద్ కథ సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో ఊహించని మలుపు తిరిగింది. ఆవేశపూరిత ప్రసంగాలు, కత్తికో కండగా ముక్కలు ముక్కలుగా నరుకుతానన్న ప్రగల్భాలు శుక్రవారం ఆయన్ని ముస్లిం ఓటర్లలో హీరోగా నిలబెట్టి ఉండొచ్చు. కానీ శనివారం సూర్యుడు నిద్రలేచే సరికి ఆయన పై కేసు పెట్టారు. కొద్ది గంటల్లోనే అరెస్టు చేశారు. ఇప్పుడు ఆయనను రిమాండ్ కి పంపించారు. హడావిడిగా ఎన్నికల ప్రచారం చేయాల్సిన ఇమ్రాన్ మసూద్ ఇప్పుడు తాపీగా ఊచలు లెక్కబెట్టుకుంటున్నారు. ఇంకా విషాదం ఏమిటంటే ఆయనకు అనుకూలంగా ఒక్కరూ మాట్లాడటం లేదు. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఇలాంటి వారిని పార్టీలో ఉంచకూడదు అన్నారు. రాహుల్ గాంధీ ఈ భాషను ఎట్టిపరిస్థితిలోనూ సమర్థించలేమని అన్నారు. రాహుల్ గాంధీ అయితే సహారన్ పూర్ లో శనివారం బహిరంగ సభనే రద్దు చేసుకున్నారు. దీంతో కాంగ్రెసీయులు మసూద్ ను పూర్తిగా వదిలేశారు. ఎన్నికల వేళ ఇలాంటి కామెంట్లు నరేంద్ర మోడీకి లాభం చేకూరుస్తాయన్నది కాంగ్రెస్ అధిష్ఠానానికి బాగా తెలుసు. గతంలో మోడీని సోనియా గాంధీ 'మౌత్ కా సౌదాగర్' అని విమర్శించింది. మోడీ దాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుని ఎన్నికల్లో విజయఢంకా మోగించాడు. అందుకే కాంగ్రెస్ మసూద్ ను ఏ మాత్రమూ వెనకేసుకురావడానికి ప్రయత్నించలేదు. -
మోడీని నరికేస్తానన్న మసూద్ అరెస్ట్
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సహరాన్ పూర్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌ను శనివారం ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మసూద్ సహరన్‌పూర్‌లో శుక్రవారం ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ... యూపీని గుజరాత్‌లా తీర్చిదిద్దుతానంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. యూపీని గుజరాత్‌లా చేసేందుకు మోడీ ప్రయత్నిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, ఆయన్ను ముక్కలుగా ముక్కలుగా నరికేస్తామని వ్యాఖ్యానించారు. తాను చావడానికే కాదు చంపడానికైనా సిద్ధమన్నారు. తన ప్రజలకోసం ప్రాణాలివ్వడానికీ సిద్ధమన్నారు. తుది శ్వాస వరకు మోడీకి వ్యతిరేకంగా పోరాడతానని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌ను మోడీ గుజరాత్ చేస్తానంటున్నారు... కానీ గుజరాత్లో ముస్లిం జనాభా కేవలం నాలుగుశాతమే...కానీ మన రాష్ట్రంలో ముస్లింల జనాభా 42 శాతంగా ఉందని మసూద్ గుర్తు చేశారు. మసూద్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం సృష్టించాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది.మసూద్ వ్యాఖ్యలను ఖండించింది. మసూద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని బీజేపీ డిమాండ్ చేసింది. దాంతో మసూద్‌పై సహరన్పూర్ జిల్లాలోని దేవ్‌బాంద్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125వ సెక్షన్, ఐపీసీకి చెందిన 153ఎ, 295 ఎ, 504, 506 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్టు యూపీ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలో మసూద్‌ను ఆయన నివాసంలో ఈ రోజు తెల్లవారుజామున 4.00 గంటలకు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు సహరాన్ పూర్ ర్యాలీకి హాజరై ప్రసంగించవలసి ఉంది. అయితే మసూద్ అరెస్ట్ నేపథ్యంలో రాహుల్ గాంధీ సహరాన్ పూర్ పర్యటన రద్దు అయింది.