రూ.10 నోట్లతో కారు కొన్నారు
రూ.10 నోట్లతో కారు కొన్నారు
Published Sun, Dec 11 2016 10:08 AM | Last Updated on Tue, Aug 28 2018 8:11 PM
మీరట్: అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం నోట్లు అందుబాటులో లేక ఇబ్బందిపడుతున్న ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ సహరాన్ పూర్ జిల్లాలోని బెహత్ మండలం కూడా ఒకటి. ఇదే సమయంలో బెహత్ మండలంలోని హుస్సేన్ గ్రామంలో వ్యసనాలకు అలవాటు పడిన ఓ యువకుల బృందం మాత్రం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ అనుమానాస్పదంగా తిరగసాగింది. రాత్రి వేళల్లో బయటకు వెళ్తూ వస్తున్న వీరు సొంతగా ఓ కారు కొన్నారు. అది మొత్తం రూ.10నోట్లతో చెల్లింపులు జరిపారు.
దీంతో పోలీసులు నసీర్, రాకేష్, అఫ్జల్, టిటూలపై నిఘా పెట్టారు. గత నెల 19వ తేదీన స్ధానిక భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్ బీఐ)ను ఈ యువకుల బృందం దోచుకున్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేశారు. విచారణలో బ్యాంకు నుంచి రూ.10 లక్షల విలువజేసే రూ.10, రూ.20నోట్లు దొంగిలించినట్లు యువకుల బృందం ఒప్పుకుంది. కాగా, దోచుకున్న డబ్బు నుంచి రూ.50వేలు, కారును స్వాధీనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుల బృందం కొనుగోలు చేసిన కారు.. సెకండ్ హ్యాండ్ అని గ్రామస్ధులు చెప్పినట్లు తెలిపారు.
Advertisement