ముజఫర్నగర్ జిల్లాలోని షరాన్పూర్లో ఇద్దరు సాధువులను ఆగంతకులు కాల్చి చంపారని జిల్లా పోలీసు ఉన్నతాధికారి శనివారం ఇక్కడ వెల్లడించారు. స్వామీ బల్ద్వానందా (35)తోపాటు ఆయన సహాయకుడు నరేంద్రని శుక్రవారం ఆగంతకులు తుపాకీతో కాల్చి చంపారని చెప్పారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నట్లు ఉన్నతాధికారి వివరించారు.
హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు. అయితే మతఘర్షణలతో అట్టుడిగి ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటున్న ముజఫర్నగర్ జిల్లాలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు.