కొట్టి తలాక్‌ అని ముఖంపై విసిరేశాడు | Woman Attacked by Husband, Gets Triple Talaq | Sakshi
Sakshi News home page

కొట్టి తలాక్‌ అని ముఖంపై విసిరేశాడు

Published Fri, Sep 8 2017 3:47 PM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM

కొట్టి తలాక్‌ అని ముఖంపై విసిరేశాడు

కొట్టి తలాక్‌ అని ముఖంపై విసిరేశాడు

సహరాన్‌పూర్‌: ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ఆ తరహా ఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఓ వ్యక్తి తన భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేయడమే కాకుండా అనంతరం ఓ చిన్న కాగితపు ముక్కపై తలాక్‌ అంటూ మూడుసార్లు రాసి ఆమె ముఖాన విసిరి కొట్టి వెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. సయీద్‌ అనే వ్యక్తి ఓ ముస్లిం మహిళను నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు.

వారు కట్నంగా ఇస్తానని చెప్పిన రూ.1లక్షను, బైక్‌ను ఇవ్వలేదని గత ఏడాది ఆమెను సయీద్‌ పుట్టింటికి పంపించాడు. ఈ క్రమంలో మొన్న బుధవారం భార్య దగ్గరకు వచ్చిన సయీద్‌ వారితో గొడవకు దిగడమే కాకుండా ఓ ఆయుదంతో దాడికి పాల్పడ్డాడు. అనంతరం తలాక్‌ అంటూ మూడుసార్లు ఓ కాగితంపై రాసి ఆమె ముఖాన విసిరికొట్టి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement