Saeed
-
ప్రపంచానికే మానవ వనరుల శక్తిగా భారత్
సాక్షి, హైదరాబాద్: వివిధ రంగాల్లో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన వారి కోసం ప్రపంచం భారత్ వైపే చూస్తోందని, ప్రపంచానికే మానవ వనరుల శక్తిగా భారత్ రూపొందిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి (సీపీవీ, ఓఐఏ) ఔసాఫ్ సయీద్ పేర్కొన్నారు. విదేశీ వలసలను ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పాస్‌పోర్టు ప్రాంతీయ అధికారులు, ఇతర ఉన్నతస్థాయి అధికారులతో ప్రాంతీయ సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన ఔసాఫ్ సయీద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితర రాష్ట్ర అధికారులతో సమావేశమై పాస్‌పోర్టు, ఇమిగ్రేషన్, విదేశీ వీసాలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం భారత ప్రధాన పాస్‌పోర్టు అధికారి ఆమ్‌స్ట్రాంగ్ చాంగ్సన్, సంయుక్త కార్యదర్శి(ఓఈ) బ్రహ్మ కుమార్, హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్యలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. విదేశాలకు వెళ్లి పనులు చేసేందుకు ఆసక్తి చూపే యువత, మహిళలకు తగిన శిక్షణ ఇచ్చి పంపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 12 దేశాలతో ఇప్పటికే మ్యాన్ పవర్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. మరో 15 దేశాలతో సంప్రదింపులు సాగుతున్నా యన్నారు. ప్రతి శనివారం విదేశాలకు వెళ్లే వారికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం పోలీసు శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించే విషయంపై డీజీపీతో చర్చించినట్లు తెలిపారు. తెలంగాణలో పాస్‌పోర్టులు వేగవంతం తెలంగాణలో పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని సయీద్ తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒక పోస్టా్టఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రంగా పనిచేస్తుందన్నారు. మరో ఐదు నెలల్లో దేశంలో ఎలక్ట్రానిక్ పాస్‌పోర్టు (ఈ పాస్‌పోర్టు)ల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అమ్‌స్ట్రాంగ్ చాంగ్సన్ తెలిపారు. -
సయీద్‌పై అమెరికా కన్నెర్ర
వాషింగ్టన్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, ఉగ్రసంస్థ జమాతుద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసిన పాక్ ప్రధాని వ్యాఖ్యలపై అమెరికా మండిపడింది. సయీద్ ఉగ్రవాదేనని స్పష్టం చేసిన అమెరికా.. చట్టప్రకారం అతనిపై అభియోగాలు మోపి పూర్తిస్థాయి విచారణ జరపాల్సిందేనంది. ‘ భద్రతామండలి ఉగ్రవాదుల జాబితాలో సయీద్ పేరుంది. 2008 ముంబై దాడుల్లో సయీద్ పాత్ర కీలకమని మేం విశ్వసిస్తున్నాం. జమాతుద్ దవా (జేయూడీ) లష్కరే సంస్థలో భాగమే. గృహనిర్బంధం నుంచి సయీద్‌ను విడుదల చేయటంపై పాక్ ప్రభుత్వానికి నిరసనను స్పష్టంగా తెలియజేశాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హీతర్ నార్ట్ చెప్పారు. గురువారం ప్రముఖ పాకిస్తాన్ చానెల్ జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని అబ్బాసీ.. సయీద్‌ను ‘సాబ్, సర్’ అని సంబోధించారు. ‘పాక్‌లో సయీద్ సర్‌పై కేసుల్లేవు’ అని అన్నారు. సయీద్‌పై చర్యలు తీసుకోవటంలో పాకిస్తాన్ చిత్తశుద్ధిని చాటుకోవాలని భారత్ సూచించింది. పసలేని కారణాలు చూపుతూ తప్పించుకునే ప్రయత్నాలను మానుకోవాలని పేర్కొంది. సయీద్‌పై అభియోగాలు మోపాలంటూ అమెరికా వ్యాఖ్యానించిన నేపథ్యంలో భారత్ ఈ విధంగా స్పందించింది. -
కొట్టి తలాక్ అని ముఖంపై విసిరేశాడు
సహరాన్పూర్: ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ఆ తరహా ఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఓ వ్యక్తి తన భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేయడమే కాకుండా అనంతరం ఓ చిన్న కాగితపు ముక్కపై తలాక్ అంటూ మూడుసార్లు రాసి ఆమె ముఖాన విసిరి కొట్టి వెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. సయీద్ అనే వ్యక్తి ఓ ముస్లిం మహిళను నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వారు కట్నంగా ఇస్తానని చెప్పిన రూ.1లక్షను, బైక్‌ను ఇవ్వలేదని గత ఏడాది ఆమెను సయీద్ పుట్టింటికి పంపించాడు. ఈ క్రమంలో మొన్న బుధవారం భార్య దగ్గరకు వచ్చిన సయీద్ వారితో గొడవకు దిగడమే కాకుండా ఓ ఆయుదంతో దాడికి పాల్పడ్డాడు. అనంతరం తలాక్ అంటూ మూడుసార్లు ఓ కాగితంపై రాసి ఆమె ముఖాన విసిరికొట్టి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు
నిత్యపెళ్లికొడుకు జూబ్లీహిల్స్: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఓ ప్రబుద్ధుడు మూడు నెలలు తిరగకుండానే నాల్గవ భార్యను వదిలి పరారయ్యాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.... టోలిచౌకి, పారామౌంట్ కాలనీలో నివసించే సిమ్రాన్ సయీద్(19) వివాహం గతేడాది నవంబర్ 13న సయ్యద్ యాసర్ అహ్మద్‌తో జరిగింది. పెళ్లి సమయంలో రూ. 30 లక్షల నగదు, 20 తులాల బంగారు నగలు కట్నంగా ఇచ్చారు. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుంచే ఆమెను అత్తగారు వేధించడం మొదలుపెట్టింది. దీంతో సిమ్రాన్ వేరు కాపురం పెట్టింది. అయినాసరే అత్త వేధింపులు ఆపకపోవడంతో వేరుకాపురం మానేసి సొంతింటికి తీసుకొచ్చింది. తన భర్త ఆభరణాల వ్యాపారి అని పెళ్లికి ముందు నమ్మించారని, తీరా చూస్తే ఏమి చేయకుండా ఇంట్లోనే ఉంటుండటంతో పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే సిమ్రాన్‌ను ఆమె అత్త గదిలో వేసి తాళం వేసి తీవ్రం గా కొట్టేది. ఈ ఏడాది జనవరి 19న ఆమెకు వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. తన కుటుంబ సభ్యులను పిలిపించి చెప్పినా ఉపయోగం లేకపోవడంతో సిమ్రాన్ తన పుట్టింటికి వెళ్లిపోయింది. మూడు రోజుల క్రితం భర్తతో పాటు అత్త, ఆమె కుటుంబ సభ్యులు పరారయ్యారు. తనను నాల్గవ వివాహం చేసుకొని మూడు నెలలు తిరగకుండానే మోసం చేసి పరారైన భర్త, అత్తపై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.