సహారన్‌పుర్ లో 20 మంది అరెస్ట్
సహారన్‌పుర్ (యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్ జిల్లాలో హింసాత్మక ఘటనకు బాధ్యలుగా భావిస్తున్న 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లను అదుపులోకి తీసుకురావడానికి ఆ ప్రాంతంలో విధించిన కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు నేడు కూడా కొనసాగిస్తున్నారు. నిన్నటికంటే పరిస్థితి కొద్దిగా మెరుగైందని జిల్లా మేజిస్ట్రేట్ సంధ్య తివారి తెలిపారు. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు.
ఒక వివాదాస్పద భూమి విషయంలో శనివారం చెలరేగిన గొడవ ఇరు వర్గాల మధ్య హింసకు దారితీసింది. ఈ హింసలో వ్యాపారస్తుల నేత హరీశ్ కొచార్‌తోపాటు మరో ఇద్దరు మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు.