ధర్మవరం (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా ధర్మవరంలోని పీఆర్‌టీ వీధిలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసమైంది. పండ్ల వ్యాపారం చేసే మల్లేశ్ కుటుంబం మంగళవారం ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం వెళ్లారు. ఆ సమయంలో గ్యాస్ లీకై సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో ఇంట్లోని తలుపులు, కిటికీలు మంటలకు కాలిపోయాయి.
గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయాయి. దాదాపు రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని కుటుంబ యజమాని మల్లేశ్ చెప్పారు. కాగా ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం
Published Tue, Oct 6 2015 3:13 PM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM
Advertisement
Advertisement