ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతి | Four Deceased, Two Hurt as Two-Storey House Collapses in Delhi | Sakshi
Sakshi News home page

ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతి

Published Sat, Dec 19 2020 2:33 PM | Last Updated on Sat, Dec 19 2020 2:42 PM

Four Deceased, Two Hurt as Two-Storey House Collapses in Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని విష్ణు గార్డెన్‌ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. రెండతస్తుల భవనం పైకప్పు కూలి నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రమాదం నెలకొన్న ఆ ఇంటిని మోటార్‌ వైండింగ్‌ ఫ్యాక్టరీగా ఉపయోగిస్తున్నారు. 

ఈ ప్రమాదంపై అదనపు డిప్యూటీ కమిషనర్‌ సుభోద్‌ కుమార్‌ గోస్వామి మాట్లాడుతూ ‘ఉదయం 10 గంటల సమయంలో భవనం పైకప్పు కూలినట్లు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆ సమయంలో ఆరుగురు ఫ్యాక్టరీలో ఉన్నారు. వారిని పోలీసులు రక్షించి, సమీప ఆస్పత్రికి తరలించాం. అయితే అప్పటికే వారిలో నలుగురు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు’ అని చెప్పారు. 



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement