వెస్టిండీస్, యూఎస్‌ఏ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే పురుషుల పొట్టి ప్రపంచకప్ కోసం మరో జట్టును ప్రకటించారు. రెండో సారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన పపువా న్యూ గినియా ఇవాళ (మే 8) తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యుల ఈ జట్టుకు అస్సద్ వలా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సీజే అమీనీ అస్సద్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఎంపికయ్యాడు. తూర్పు ఆసియా పసిఫిక్ రీజియనల్ పోటీల ద్వారా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన పపువా న్యూ గినియా 2021లో తొలిసారి ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యింది. ఆ ఎడిషన్‌లో ఈ జట్టు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.
ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో 10 మంది 2021 ప్రపంచకప్ స్క్వాడ్‌లో ఉన్నారు. 2024 ప్రపంచకప్‌లో గినియా జర్నీ జూన్ 2న ప్రారంభమవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో గినియా.. పటిష్టమైన వెస్టిండీస్‌ను ఢీకొంటుంది. ప్రపంచకప్ గ్రూప్-సిలో ఉన్న గినియా.. గ్రూప్ దశలో వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, ఉగాండ జట్లతో పోటీపడుతుంది.
టీ20 ప్రపంచకప్ 2024 కోసం పపువా న్యూ గినియా జట్టు: అస్సద్ వలా (కెప్టెన్), సీజే అమీనీ (వైస్ కెప్టెన్), అలీ నావో, చాడ్ సోపర్, హిలా వరే, హిరి హిరి, జాక్ గార్డనర్, జాన్ కారికో, కబువా వాగి మోరియా, కిప్లింగ్ డోరిగా, లెగా సియాకా, నార్మన్ వనువా, సెమా కమియా, సెసే బావు, టోనీ ఉరా
పొట్టి ప్రపంచకప్ కోసం ఇప్పటిదాకా 15 జట్లను ప్రకటించారు. మరో జట్లను ప్రకటించాల్సి ఉంది.
జట్ల వివరాలను వెల్లడించిన దేశాలు..
భారత్
ఇంగ్లండ్
ఆస్ట్రేలియా
ఒమన్
సౌతాఫ్రికా
న్యూజిలాండ్
ఆఫ్ఘనిస్తాన్
నేపాల్
కెనడా
వెస్టిండీస్
యూఎస్‌ఏ
ఉగాండ
స్కాట్లాండ్
ఐర్లాండ్
పపువా న్యూ గినియా
జట్లను ప్రకటించాల్సిన దేశాలు..
పాకిస్తాన్
నమీబియా
నెదర్లాండ్స్
శ్రీలంక
బంగ్లాదేశ్
Comments
Please login to add a commentAdd a comment