కూలిన విమానం : 12 మంది మృతి | Australian pilot among 12 people killed in Papua New Guinea plane crash | Sakshi
Sakshi News home page

కూలిన విమానం : 12 మంది మృతి

Published Thu, Apr 14 2016 10:23 AM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

కూలిన విమానం : 12 మంది మృతి

కూలిన విమానం : 12 మంది మృతి

పోర్ట్ మారెస్బి : పవువా న్యూగినియాలో తేలికపాటి విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పవువా న్యూగినియా పశ్చిమ ప్రావిన్స్లోని కింగ్నా ఎయిర్ పోర్టులో సదరు విమానం రన్ వేపై దిగుతున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఆస్ట్రేలియా వాసి కూడా ఉన్నాడని ఆ దేశ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగం స్పష్టం చేసింది. అతడు పవువా న్యూగినియాకు చెందిన సన్ బర్డ్ ఏవియేషన్లో విధులు నిర్వహిస్తున్నాడని పేర్కొంది.ఈ ప్రమాదానికి ముందు విమానంలోని ఇంజన్ పాడైందని.. ఈ నేపథ్యంలో ఈ విమానం కుప్పకూలిందని స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొంది.  ఈ విమాన దుర్ఘటన బుధవారం మధ్యాహ్నం 3.00 గంటలకు చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement