
న్యూజిలాండ్‌లో జరగుతున్న అండర్ -19 ప్రపంచకప్‌లో భారతయువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. రెండు రోజుల క్రితం పేస్ బౌలింగ్‌తో ఆష్ట్రేలియా వెన్ను విరిచిన యువ బౌలర్లు మరోసారి చెలరేగిపోయారు. క్రికెట్‌లో పసికూన పాపువా న్యూ గినియాను ఈసారి స్పిన్‌తో తిప్పేశారు. ఆల్ రౌండర్‌గా ఎదుగుతున్న యువకెరటం అనుకుల్ రాయ్ తన బౌలింగ్‌తో పాపువా న్యూ గినియా నడ్డి విరిచారు.
అండర్ 19 ప్రపంచకప్‌లో పాపువా న్యూ గినియాతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో యువ ఆటగాడు అనుకుల్ రాయ్ మెరిశాడు. బ్యాటింగ్‌లో రాణించే అనుకుల్ రాయ్ ఈసారి బంతితో ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బకొట్టాడు. రాయ్ దెబ్బకు న్యూగినియా 21.5 ఓవర్లలో 64పరుగులకే చాప చుట్టేసింది. 6.5 ఓవర్లు వేసిన రాయ్ 14 పరుగులు ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలోవేసుకున్నాడు. ఇందులో రెండు ఓవర్లు మెయిడెన్‌లు కూడా ఉన్నాయి. శివం మవి రెండు వికెట్లు పడగొట్టగా, కమలేశ్ నగర్‌కోటి, అర్షదీప్‌సింగ్ చెరో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment