Anukul Roy
-
అనుకుల్పై ఫ్రాడ్ ఆరోపణలు
న్యూఢిల్లీ : అండర్-19 ప్రపంచకప్ విజేత భారత జట్టులో సభ్యుడైన అనుకుల్ రాయ్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రికెస్ అసోసియేషన్ ఆఫ్ బిహార్(సీఏవో) కార్యదర్శి ఆదిత్య వర్మ అనుకుల్పై ఆరోపణలు చేశారు. అండర్-19లో పాల్గొనేందుకు అనుకుల్ వయసు పరంగా మోసం చేశాడని అన్నారు. ఈ విషయం బీసీసీఐ ప్రస్తుత కార్యదర్శి అమితాబ్ చౌదరికి కూడా తెలుసునంటూ బాంబు పేల్చారు. ఆదిత్య వర్మ ఆరోపణలను అనుకుల్ ఖండించాడు. ఆదిత్య ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియదని, అన్ని రకాల పరీక్షలు పూర్తైన తర్వాత తాను ప్రపంచకప్‌కు ఆడేందుకు వెళ్లినట్లు చెప్పాడు. స్పిన్నరైన అనుకుల్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. -
భారత్ మరో ఘన విజయం
-
మెరిసిన అనుకుల్.. భారత్ ఘన విజయం
భారత యువ ఆటగాళ్లు మరోసారి అదరగొట్టారు. న్యూజిలాండ్‌లో జరుగుతున్నఅండర్ -19 ప్రపంచకప్‌లో మరో విజయాన్ని అందుకున్నారు. రెండు రోజుల క్రితం పేస్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా వెన్ను విరిచిన యువ బౌలర్లు, మరోసారి చెలరేగిపోయారు. క్రికెట్లో పసికూన పాపువా న్యూ గినియాను ఈసారి స్పిన్‌తో తిప్పేశారు. అటు బంతితో, ఇటు బ్యాట్‌తో రాణించి వరుసగా రెండో విజయాన్ని అందుకున్నారు. ఫలితంగా పృథ్వీ షా నేతృత్వంలోని యువ జట్టు అండర్ 19 ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి భారత్.. పాపువా న్యూ గినియాను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత బౌలింగ్ ముందు ప్రత్యర్థి జట్టు తేలిపోయింది. ఏదశలోను పోటి ఇవ్వలేక పోయింది. యువ ఆటగాడు, ఆల్‌రౌండర్ అనుకుల్ రాయ్ మెరవడంతో అతి తక్కువ పరుగులకే చాపచుట్టేసింది. కేవలం 21.5 ఓవర్లలో 64పరుగులకే ఆలౌటైంది. 6.5 ఓవర్లు వేసిన రాయ్ తన బౌలింగ్‌తో న్యూగినియాకు ముచ్చెమటలు పట్టించాడు. కేవలం 14 పరుగులు ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలోవేసుకున్నాడు. ఇందులో రెండు ఓవర్లు మెయిడెన్లు కూడా ఉన్నాయి. శివం మవి రెండు వికెట్లు పడగొట్టగా, కమలేశ్ నగర్కోటి, అర్షదీప్‌సింగ్ చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ స్వల్పలక్ష్యాన్ని అలవోకగా చేధించింది. కెప్టెన్ పృథ్వీ షా అర్ద సెంచరీతో చెలరేగాడు. 39 బంతుల్లో 57 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు. మరో బ్యాట్‌మెన్ మంజోత్ కర్లా 9 బంతుల్లో 9 పరుగులు చేసి పృథ్వీ షా కు సహకారం అందించాడు. ఇద్దరు కలిసి విజయానికి కావాల్సిన పరుగులను కేవలం 8 ఓవర్లలోనే బాదేశారు. -
అండర్-19 లో అనుకుల్ రాయ్ సంచలనం
న్యూజిలాండ్‌లో జరగుతున్న అండర్ -19 ప్రపంచకప్‌లో భారతయువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. రెండు రోజుల క్రితం పేస్ బౌలింగ్‌తో ఆష్ట్రేలియా వెన్ను విరిచిన యువ బౌలర్లు మరోసారి చెలరేగిపోయారు. క్రికెట్లో పసికూన పాపువా న్యూ గినియాను ఈసారి స్పిన్‌తో తిప్పేశారు. ఆల్ రౌండర్‌గా ఎదుగుతున్న యువకెరటం అనుకుల్ రాయ్ తన బౌలింగ్‌తో పాపువా న్యూ గినియా నడ్డి విరిచారు. అండర్ 19 ప్రపంచకప్‌లో పాపువా న్యూ గినియాతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో యువ ఆటగాడు అనుకుల్ రాయ్ మెరిశాడు. బ్యాటింగ్‌లో రాణించే అనుకుల్ రాయ్ ఈసారి బంతితో ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బకొట్టాడు. రాయ్ దెబ్బకు న్యూగినియా 21.5 ఓవర్లలో 64పరుగులకే చాప చుట్టేసింది. 6.5 ఓవర్లు వేసిన రాయ్ 14 పరుగులు ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలోవేసుకున్నాడు. ఇందులో రెండు ఓవర్లు మెయిడెన్లు కూడా ఉన్నాయి. శివం మవి రెండు వికెట్లు పడగొట్టగా, కమలేశ్ నగర్కోటి, అర్షదీప్‌సింగ్ చెరో వికెట్ తీశారు.