
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పేసర్ లాకీ ఫెర్గూసన్ అద్భుతమైన బంతితో మెరిశాడు. అప్పటికే అర్ధ సెంచరీ సాధించి మంచి ఊపు మీద ఉన్న జోస్ బట్లర్‌ను ఫెర్గూసన్ స్లో యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆరో ఓవర వేసిన ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఐదో బంతిని బారీ సిక్స్ బాదిన బట్లర్.. అఖరి బంతికికూడా భారీ షాట్‌కు ప్రయత్నించాడు.
అయితే తెలివిగా ఫెర్గూసన్ తన బౌలింగ్‌లో పేస్ తగ్గించి స్లో యార్కర్ వేశాడు. ఫెర్గూసన్ వేసిన బంతికి బట్లర్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ గుజరాత్ టైటాన్స్ చేతిలో 37 పరుగులు తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది.
చదవండి: IPL 2022 RR Vs GT: హార్ధిక్ పాండ్యాకు ఏమైంది.. ? మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు!
Jos Buttler X Slower ball pic.twitter.com/m0qkktCk4c
— Mohammed Asif (@Klassy__KL) April 14, 2022
Comments
Please login to add a commentAdd a comment