వెల్లింగ్టన్: తమ క్రికెటర్ లూకీ ఫెర్గ్యూసన్‌కు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో వణికిపోయిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. లూకీ ఫెర్గ్యూసన్ రిపోర్ట్ నెగిటివ్ రావడంతో కివీస్ జట్టుకు ఉపశమనం లభించింది. తొలుత ఫెర్గ్యూసన్ గొంతు నొప్పితో బాధ పడ్డాడు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ సోకిందనే అనుమానాలు కూడా తలెత్తాయి. అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించారు. కాగా, కరోనా వైరస్ సోకలేదని తేలడంతో ఫెర్గ్యూసన్‌తో పాటు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు ఊరట దక్కింది. (కరోనాపై కోహ్లి స్పందన..)
ఆస్ట్రేలియాతో తొలి వన్డే తర్వాత ఫెర్గ్యూసన్ విపరీతమైన గొంతు మంటతో సతమతమయ్యాడు. దాంతో జట్టు బస చేసిన హోటల్‌లోనే అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేశారు. అది సాధారమైన గొంతు నొప్పి అని చివరకు రిపోర్ట్‌లో తేలింది. ఫలితంగా అతను యథావిధిగా జట్టుతో కలవనున్నాడు. అంతకుముందు ఆసీస్ క్రికెటర్ కేన్ రిచర్డ్‌సన్‌కు సైతం కరోనా భయంతో ప్రత్యేక చికిత్స చేశారు. అతనికి జరిపిన పరీక్షల్లో ‘నెగెటివ్’ రిపోర్టు వచ్చింది. అదే వన్డేకు ముందు రిచర్డ్సన్ గొంతు నొప్పితో బాధపడ్డాడు. అతడిని పరిశీలించి వైద్య బృందం సూచన మేరకు జట్టు నుంచి తప్పించి విడిగా ఉంచారు. ఇటీవలే అతను విదేశాల నుంచి తిరిగి రావడంతో సందేహం పెరిగింది. (బాస్ గుర్తులేడా వార్న్.. )
Comments
Please login to add a commentAdd a comment