photo credit: IPL Twitter
ఐపీఎల్-2023 సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యంత వేగవంతమైన బంతి రికార్డైంది. అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 9) జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ లోకీ ఫెర్గూసన్ ఐపీఎల్-2023 ఫాస్టెస్ట్ డెలివరీ సంధించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ బౌల్ చేసిన ఫెర్గూసన్.. గిల్ ఎదుర్కొన్న రెండో బంతిని గంటకు 154.1 కిమీ బుల్లెట్ వేగంతో సంధించాడు.
Lockie Ferguson bowled the fastest bowl of IPL 2023 - 154.1 kph. #KKR Blood 💜#KKRvsGT #IPL2023 pic.twitter.com/iTLju1q6Ry
— SRKholic Saify 🇮🇳 (@SRKholic_Saify) April 9, 2023
ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఏ బౌలర్ ఇంత వేగవంతమైన బంతి వేయలేదు. ఈ ఓవర్లో నిప్పులు చెరిగిన ఫెర్గూసన్.. తొలి బంతిని 149 కిమీ వేగంతో, మూడో బంతిని 150.15 కిమీ వేగంతో, నాలుగో బంతిని 151.4 కిమీ వేగంతో సంధించి, పేస్‌కా సుల్తాన్ అనిపించుకున్నాడు. అయితే ఇంత చేసినా అతనికి ఒక్క వికెట్ కూడా దక్కకపోగా.. ధారాళంగా (4 ఓవర్లలో 40) పరుగులు సమర్పించుకున్నాడు.
ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. విజయ్ శంకర్ (24 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (38 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించగా, శుభ్‌మన్ గిల్ (31 బంతుల్లో 39; 5 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్‌కు 3, సుయాశ్ శర్మకు ఓ వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment