
బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో కివీస్ క్లీన్‌స్వీప్ చేసింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం 4 వికెట్లు కోల్పోయి చేధించింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(56), డార్లీ మిచెల్(48) పరుగులతో రాణించారు. ఐరీష్ బౌలర్లలో లిటిల్ రెండు వికెట్లు, యంగ్,డాక్రెల్ తలా వికెట్ సాధించారు.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో స్టిర్లింగ్ 40 పరగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అడైర్ 37 పరుగులతో అఖరిలో మెరుపులు మెరిపించాడు. కివీస్ బౌలర్లలో టిక్నర్, ఇష్ సోధి రెండు వికెట్లు పడగొట్టగా..జాకబ్ డఫీ,మిచెల్ తలా వికెట్ సాధించారు. కాగా అంతకుముందు వన్డే సిరీస్‌ను కూడా న్యూజిలాండే సొంతం చేసుకుంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌కే వరించాయి.
చదవండి: IND Vs WI 1st ODI: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు..!
Comments
Please login to add a commentAdd a comment