clean sweeps
-
IRE vs NZ 3rd T20: తిరుగులేని న్యూజిలాండ్.. సిరీస్ క్లీన్‌స్వీప్
బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో కివీస్ క్లీన్‌స్వీప్ చేసింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం 4 వికెట్లు కోల్పోయి చేధించింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(56), డార్లీ మిచెల్(48) పరుగులతో రాణించారు. ఐరీష్ బౌలర్లలో లిటిల్ రెండు వికెట్లు, యంగ్,డాక్రెల్ తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో స్టిర్లింగ్ 40 పరగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అడైర్ 37 పరుగులతో అఖరిలో మెరుపులు మెరిపించాడు. కివీస్ బౌలర్లలో టిక్నర్, ఇష్ సోధి రెండు వికెట్లు పడగొట్టగా..జాకబ్ డఫీ,మిచెల్ తలా వికెట్ సాధించారు. కాగా అంతకుముందు వన్డే సిరీస్‌ను కూడా న్యూజిలాండే సొంతం చేసుకుంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌కే వరించాయి. చదవండి: IND Vs WI 1st ODI: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు..! -
ఏపీ: జెడ్పీల్లోనూ ‘సామాజిక’ రెపరెపలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇప్పటికే అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. శనివారం జరిగిన జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయా పదవులను ఏకగ్రీవం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసింది. 13 జిల్లాల జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికల్లో తిరుగులేని అఖండ విజయం సాధించింది. అంతేకాదు.. రాజకీయాల్లో సామాజిక విప్లవం సృష్టిస్తున్న ఆ పార్టీ మరోసారి జెడ్పీ పదవుల్లోనూ రెపరెపలాడించింది. ఇక ఒక రాష్ట్రంలో అన్ని జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఒకే పార్టీ చేజిక్కించుకోవడం దేశంలో ఇదే తొలిసారి. ఇలా కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీ 630 జెడ్పీటీసీ స్థానాల్లో చారిత్రక విజయం సాధిం చింది. విపక్ష పార్టీలైన టీడీపీ కేవలం ఆరు, జనసేన రెండు, సీపీఎం 1, ఇతరులు ఒక స్థానంలో మాత్రమే గెలుపొందాయి. కో–ఆప్షన్ సభ్యుల పదవులకూ శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఇందులోనూ అన్ని పదవులకు వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదీ సామాజిక న్యాయమంటే.. జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయాన్ని మరోసారి చేతల్లో చూపించారు. 13 జిల్లా పరిషత్ చైర్మన్/చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏకంగా తొమ్మిది కేటాయించారు. అలాగే.. ►విజయనగరం, చిత్తూరు జెడ్పీ చైర్మన్ పదవులను జనరల్ విభాగానికి ప్రభుత్వం రిజర్వు చేసింది. కానీ, ఆ రెండింటినీ బీసీ వర్గాలకు చెందిన మజ్జి శ్రీనివాసరావు, గోవిందప్ప శ్రీనివాసులుకు అవకాశం కల్పించారు. ►కృష్ణాజిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవిని జనరల్ (మహిళ)కు ప్రభుత్వం రిజర్వు చేస్తే.. ఆ పదవిని బీసీ మహిళ ఉప్పాల హారికకు పట్టంగట్టారు. ►ఇలా జనరల్, జనరల్ (మహిళ) విభాగాలకు ప్రభుత్వం రిజర్వు చేసిన మూడు జెడ్పీ అధ్యక్ష పదవుల్లో బీసీ వర్గాలకు అవకాశం కల్పించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ సామాజిక ఢంకా మోగించారని రాజకీయ పరిశీలకులు ప్రశంసిస్తున్నారు. ►మరోవైపు.. ఒక్కో జిల్లా పరిషత్‌కు ఇద్దరేసి ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. మొత్తం 26 ఉపాధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 20 పదవులను కేటాయించారు. మిగిలిన ఆరింటిలో ఓసీలకు అవకాశం కల్పించారు. ►అంతేకాక.. జిల్లా పరిషత్ చైర్పర్సన్లుగా ఏడుగురికి.. వైస్ చైర్పర్సన్లుగా 15 మంది మహిళలకు అవకాశం కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు సీఎం వైఎస్ జగన్ మరోసారి పెద్దపీట వేశారు. ►ఇక రాష్ట్రంలో 620 ఎంపీపీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి 67 శాతం, ఓసీలకు 33 శాతం పదవులను కేటాయించారు. ఎంపీపీ పదవుల్లో ఏకంగా 64 శాతం (397) పదవులను మహిళలకు కేటాయిస్తే.. 36 శాతం (223) పదవులను పురుషులకు కేటాయించారు. ‘జనరల్’లో బీసీలకు అవకాశం ►విజయనగరం, చిత్తూరు జెడ్పీ చైర్మన్ పదవులను జనరల్ విభాగానికి ప్రభుత్వం రిజర్వు చేసింది. కానీ, ఆ రెండింటినీ బీసీ వర్గాలకు చెందిన మజ్జి శ్రీనివాసరావు, గోవిందప్ప శ్రీనివాసులుకు అవకాశం కల్పించారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవిని జనరల్ (మహిళ)కు రిజర్వు చేస్తే.. బీసీ మహిళ ఉప్పాల హారికకు పట్టంగట్టారు. -
ఆసీస్ క్లీన్‌స్వీప్
సిడ్నీ: మరోసారి ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన ఆస్ట్రేలియా జట్టు కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించింది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరిదైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 279 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 416 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన న్యూజిలాండ్‌ను ఆసీస్ స్పిన్నర్ లయన్ (5/68) మరోసారి దెబ్బతీశాడు. దాంతో కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది. గ్రాండ్‌హోమ్ (52; 5 ఫోర్లు, సిక్స్) కివీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో కివీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రాస్ టేలర్ (7174) అవతరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో లయన్ వేసిన 17వ ఓవర్ మూడో బంతికి మూడు పరుగులు చేయడం ద్వారా అంతకుముందు కివీస్ మాజీ సారథి స్టీఫెన్ ఫ్లెమింగ్ (7172) పేరు మీద ఉన్న ఈ రికార్డును సవరించాడు. ఫ్లెమింగ్ 189 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధిస్తే... టేలర్‌కు 175 ఇన్నింగ్స్‌లే అవసరమయ్యాయి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 40/0తో సోమవారం ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను 2 వికెట్లకు 217 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వార్నర్ అజేయ శతకం (111 నాటౌట్; 9 ఫోర్లు)తో అలరించాడు. లబ్‌షేన్ (59; 3 ఫోర్లు) మరోసారి తన ఫామ్‌ను చాటుకున్నాడు. లబ్‌షేన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తోపాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. -
పశ్చిమాన హస్తమయం
కొద్ది నెలల కిందట జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయింది. అయితేనేం!! ఈ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు మళ్లీ మోదీ–షా ద్వయానికి పట్టం గట్టారు. ఫలితంగా కమలం మరింత వికసించింది. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్ని బీజేపీ ఏకంగా క్లీన్‌స్వీప్ చేసి కాంగ్రెస్‌ను జీరో చేసింది. గోవాలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై రాజధానిగా ఉన్న మహారాష్ట్రలో బీజేపీ తన ఆధిపత్యాన్ని పూర్తిస్థాయిలో కనబరిచింది. మహారాష్ట్రలోని 48 స్థానాలకుగాను బీజేపీ – శివసేన కూటమి 41 స్థానాలను గెలుచుకునే పరిస్థితిలో ఉంది. బీజేపీ సొంతంగా 23 స్థానాల్లో, శివసేన 18 స్థానాల్లో విజయబావుటా ఎగురవేశాయి. కాంగ్రెస్ కూటమి 7 స్థానాల్లోను, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. ఇక్కడ నాలుగు దశల్లో ఎన్నికలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ శివసేనతో జట్టుకట్టి బరిలో దిగగా.. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లు పోటీగా నిలిచాయి. గత ఎన్నికల సమయంలో బీజేపీ శివసేనలు కలిసికట్టుగా పోటీ చేసి ఘన విజయం సాధించినప్పటికీ ఆ తరువాతి కాలంలో ఇరు పార్టీలూ చెరోదారి పట్టాయి. నాలుగేళ్లపాటు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నా ఎన్నికల సమయానికి మాత్రం రెండు పార్టీలూ మళ్లీ జట్టు కట్టేశాయి. వ్యవసాయ సంక్షోభం తీవ్రస్థాయిలో కనిపించిన మహారాష్ట్రలో బీజేపీ –శివసేన గెలుపు అంత సులభం కాబోదన్న అంచనాలు ముందుగా వెలువడినప్పటికీ ఫలితాల సమయానికి పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే శివసేనపై నేరుగా విమర్శలు గుప్పించడం, ప్రజల్లో ఆయన సభలకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో శివసేన బలహీన పడుతుందని అంచనా వేశారు. అయితే సీట్ల కేటాయింపులో కాంగ్రెస్, ఎన్సీపీల్లో గందరగోళం నెలకొనడం... శరద్‌పవార్ పోటీ చేయకపోయినా ఆయన మనుమల వరసైన వారు ఇద్దరు బరిలో ఉండటం తదితర కారణాల వల్ల ఎన్సీపీని ప్రజలు పెద్దగా ఆదరించలేదన్న అంచనాలున్నాయి. ముంబైలోని గుజరాతీ, మరాఠీ మధ్య తరగతి వర్గం గట్టి మద్దతునివ్వడంతో బీజేపీ– శివసేన కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించగలిగింది. కాంగ్రెస్– ఎన్సీపీలకు ముస్లిం మైనార్టీల మద్దతు కూడా ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో స్వల్ప స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊర్మిళ మటోండ్కర్ వంటి సినీనటిని ముంబై నార్త్ ఓటర్లు ఆదరించలేదు. మహారాష్ట్ర ఎన్నికల మొత్తానికి అత్యంత ఆసక్తికరమైన పరిణామం ఔరంగాబాద్‌లో నమోదైంది. చతుర్ముఖ పోటీ కారణంగా ఓట్లు చీలిపోవడంతో ఆలిండియా ఇత్తేహదుల్ ముస్లమీన్ అభ్యర్థి ముందజలో నిలిచారు. గుజరాత్లో కమలం క్లీన్‌స్వీప్ ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో భాజపా క్లీన్ స్వీప్ చేసి గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసింది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గాంధీనగర్ స్థానంలో రెండు లక్షలకుపైగా ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఒక్క అమ్రేలీ స్థానంలోనే ప్రతిపక్ష నేత పరేశ్ ధనాని బీజేపీ అభ్యర్థి నరన్ కచ్చాడియాకు గట్టిపోటీ ఇచ్చారు. ఇద్దరి మధ్య అంతరం అతిస్వల్పంగా ఉండటం గమనార్హం. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ జరిగింది. రికార్డు స్థాయిలో 64.11 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ జరిగింది. 2014 ఎన్నికల్లో బీజేపీ గుజరాత్‌లోని అన్ని లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 81 స్థానాలు సాధించడం.. బీజేపీ 99 స్థానాలతో అతికష్టమ్మీద అధికారం చేపట్టడం లోక్‌సభ ఎన్నికలపై ఆ ప్రభావం పడుతుందని అంతా అంచనా వేశారు. అయితే పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను స్వయంగా గాంధీనగర్‌లో పోటీకి దింపడం ద్వారా బీజేపీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది. లోక్‌సభకు పోటీ చేయడం అమిత్ షాకు ఇదే తొలిసారి. సౌరాష్ట్ర ప్రాంతంలోని రాజ్‌కోట్‌లో వ్యవసాయ సంక్షోభం సమస్య బీజేపీని కొంత కలవర పెట్టినా దాన్ని కూడా అధిగమించగలిగింది. జీఎస్టీ అమల్లోని లోపాలు గుజరాత్ వ్యాపారులను దెబ్బతీశాయని.. ఫలితంగా వారూ బీజేపీకి దూరం కావచ్చునని భావించారు. అయితే ఈ అంచనాలన్నింటినీ తారుమారు చేస్తూ.. బీజేపీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఘన విజయం సాధించింది. పాటీదార్ ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన హార్ధిక్ పటేల్ కాంగ్రెస్‌లో చేరి పోటీకి సిద్ధమైనప్పటికీ కోర్టు జోక్యంతో పోటీ చేయలేకపోయారు. మరోవైపు ఓబీసీ వర్గానికి చెందిన అల్పేశ్ ఠాకూర్ కాంగ్రెస్‌ను వీడిపోవడం ఆ పార్టీని బలహీన పరిచిందని చెప్పవచ్చు. గోవాలో సగం.. సగం.. పశ్చిమ కనుమల్లోని అతిచిన్న రాష్ట్రం గోవాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో బీజేకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నార్త్ గోవా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శ్రీపాద్ యశోనాయక్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన గిరీశ్ రాయ ఛోడాంకర్పై భారీ మెజార్టీతో గెలవగా... దక్షిణ గోవాలో మాత్రం కాంగ్రెస్‌కు చెందిన కోస్మే ఫ్రాన్సిస్కో కైటానో సర్డిన్హా బీజేపీ అభ్యర్థి నరేంద్ర సావల్కర్పై స్వల్ప ఆధిక్యంలో విజయం సాధించారు. ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇక్కడ బరిలో ఉంది. మొత్తం 71 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నార్త్, సౌత్ గోవా రెండింటినీ గెలుచుకోగా.. ఈ సారి ఫలితం కాస్త తారుమారయింది. కేంద్రపాలిత ప్రాంతమైన దామన్ అండ్ డయ్యూ,లో బీజేపీ అభ్యర్థి లాలూభాయ్ బాబూభాయ్ ఘన విజయం సాధించగా.. దాద్రా అండ్ నగర్ హవేలీలో స్వతంత్ర అభ్యర్థి దేల్కర్ మోహన్ భాయ్ సాంజీ భాయ్ గెలుపొందారు. రాజకోటను గెలిచిందెవరు? ఎన్నికల జరిగిన ప్రతిసారి అధికార పార్టీని ఓడించడం రాజస్థాన్ ప్రత్యేకత. ఈ సారి మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన ఈ రాష్ట్రంలో ఈ సారి కూడా కమలం పార్టీ పూర్తిస్థాయిలో ఆధిక్యం సాధించింది. మొత్తం 25 స్థానాలకు గాను 24 స్థానాలను గెలుచుకుంది. ఒక్క స్థానంలో రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ విజయం సాధించింది. గత ఏడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీని కాదని కాంగ్రెస్‌కు పట్టం కట్టిన రాజస్థాన్ ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లోనూ అదేతీరును కనబరుస్తారని చాలామంది అంచనా వేశారు. అయితే బీజేపీ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై ఉన్న అసంతృప్తిని అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా వ్యక్తం చేసిన ఓటరు లోక్‌సభకు వచ్చేసరి మరోసారి మోదీకి జై కొట్టినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కుమారుడు వైభవ్ గెహ్లోట్ జోధ్‌పూర్ నుంచి బరిలోకి దిగగా.. ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెఖావత్ చేతిలో ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో లక్షకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన రాజస్థాన్‌లో ఏప్రిల్ 29, మే 6న రెండు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన పోటీలో బీజేపీ, కాంగ్రెస్‌లు ముఖాముఖి తలపడ్డాయి. రెండు దశల ఓటింగ్ శాతం 66.07గా నమోదైంది. 2014 ఎన్నికల్లో రాజస్థాన్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది.