పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ పేసర్ హారిస్ రౌఫ్ వేసిన బంతి స్పీడుకు గ్లెన్ పిలిప్స్ బ్యాట్ విరగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కివీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ హారిస్ రౌఫ్ వేశాడు. ఆ ఓవర్ హారిస్ వేసిన నాలుగో బంతి 143 కిమీ వేగంతో గ్లెన్ పిలిప్స్ వైపు దూసుకొచ్చింది.
షాట్ ఆడడానికి ప్రయత్నించిన పిలిప్స్ బ్యాట్‌ను అడ్డుపెట్టాడు. అంతే బులెట్ వేగంతో దూసుకొచ్చిన బంతి బ్యాట్ ఎడ్జ్‌ను చీల్చడంతో బ్యాట్ చివరిభాగం విరిగింది. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక హారిస్ రౌఫ్ ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి డెవన్ కాన్వే, ఇష్ సోదీల రూపంలో రెండు వికెట్లు తీశాడు.
మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్‌తో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్ ఐదు వికెట్లతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 59 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. గ్లెన్ పిలిప్స్ 29, మార్క్ చాప్‌మన్ 25 పరుగులు చేశారు.
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. పాక్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 34 పరుగులు), మహ్మద్ నవాజ్(22 బంతుల్లో 38 పరుగులు), హైదర్ అలీ(15 బంతుల్లో 31 పరుగులు).. చివర్లో ఇప్తికర్ అహ్మద్(14 బంతుల్లో 25 నాటౌట్) సంయుక్తంగా రాణించారు.
Haris Rauf firing bullets today that was Phillips’ favourite bat apparently 😂 pic.twitter.com/8WPcVEEi1b
— adi✨|| haris rauf cheerleader (@adidoescricket) October 14, 2022
Comments
Please login to add a commentAdd a comment